28.7 C
Hyderabad
April 24, 2024 03: 45 AM
Slider ప్రత్యేకం

రైతాంగానికి సాయపడడంలో వైసీపీ ప్రభుత్వ విఫలం

#somu veerraju

కడప కలెక్టరేట్ ఎదుట గురువారం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

రైతులకు వెంటనే సబ్సిడీ క్రింద డ్రిప్ పరికరాలు అందించాలని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ రాయలసీమ రాజస్థాన్ తర్వాత తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతం అని,ఇలాంటి  రాష్ట్రాలకు డ్రిప్ ఇరిగేషన్ కోసం కేంద్రం  పదివేల కోట్లు కేటాయించిందని అన్నారు

.గత ప్రభుత్వం హయాంలో 900కోట్లు సూక్ష్మ సేద్య పరికరాల బకాయిలు ఉన్నాయని అన్నారు.వైసీపీ ప్రభుత్వం డ్రిప్ పరికరాలు సబ్సిడీ క్రింద ఇవ్వడం లో విఫలమైందని ఆరోపించారు.

జిల్లాలో సుగర్ ఫ్యాక్టరీ, పాల ఫ్యాక్టరీ మూతపడిందని అన్నారు.షుగర్ ఫ్యాక్టరీ, పాల ఫ్యాక్టరీ లను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు .రైతాంగానికి సాయపడడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు.దీనిపై

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని వెల్లడించారు.

Related posts

తొలి బ్యాచ్ ఆర్టీసీ శిక్షణ పొందిన డ్రైవర్లకు సర్టిఫికెట్లు

Satyam NEWS

వివేకా మర్డర్: అత్యంత ప్రముఖుడిని ప్రశ్నించిన సీబీఐ?

Satyam NEWS

వచ్చే నెల రెండున ముఖ్యమంత్రి కేసీఆర్ రాక

Satyam NEWS

Leave a Comment