27.7 C
Hyderabad
April 26, 2024 04: 00 AM
Slider హైదరాబాద్

నిజాం నిరంకుశ పాలన తలపిస్తున్న కేసీఆర్ పాలన

#bjpkukatpally

కెసిఆర్ నిరంకుశ పాలన లో సామాన్య ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితులు కనిపించడం లేదని, కెసిఆర్ పాలన నిజాం నిరంకుశ పాలనను తలపిస్తుందని కూకట్ పల్లి నియోజకవర్గం బిజెపి ఇన్ ఛార్జ్ మాధవరం కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఓ మహిళను  టిఆర్ఎస్ నాయకుడు లైంగిక వేధింపులకు గురి చేసిన విషయం లో చర్యలు తీసుకోవాలని బిజెపి నాయకులు నిర్వహించిన ధర్నాలో పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా గురువారం ఉదయం కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.

కూకట్ పల్లి నియోజకవర్గం బిజెపి ఇన్ ఛార్జ్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో చేపట్టిన చేసిన కార్యక్రమాన్ని ప్రారంభం కాకముందే పోలీసులు అడ్డుకొని బీజేపీ నాయకులను అరెస్టు చేసి బాలా నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాధవరం కాంతారావు మాట్లాడుతూ కెసిఆర్ నిరంకుశ పాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సామాన్య ప్రజలు  తమకు టిఆర్ఎస్ నాయకులతో అన్యాయం జరిగిందని, పోలీస్ స్టేషన్ కి వెళ్తే… పోలీసులు బాధితుల పైనే కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టిఆర్ఎస్ నాయకుల ఆగడాలకు బలైపోయి, ఫిర్యాదు చేయడానికి ధైర్యం లేక, నోరు లేక ఎందరో  అభాగ్యులు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

కూకట్ పల్లి నియోజకవర్గంలోఅధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోయిందని, స్థానిక ఎమ్మెల్యే అండ చూసుకొని టిఆర్ఎస్ నాయకులు తమ ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నరని విమర్శించారు. లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలకు న్యాయం చేయాలని ఆందోళన చేపడితే పోలీసులు అత్యుత్సాహం చూపించి, బిజెపి నాయకులను విచక్షణా రహితంగా కొట్టడం, పిడి గుద్దులతో కార్యకర్తలు భయబ్రాంతులకు గురి చేసి, పోలీసులు తమ స్వామి భక్తి ని నిరూపించుకున్నారని ఆక్రోశం వ్యక్తం చేశారు.

పోలీసుల చర్యలకు  నిరసనగా శాంతియుతంగా చేపట్టిన నిరసన ను  అడ్డుకుని అరెస్టు చేయడం పోలీసుల దౌర్జన్యనికి  నిదర్శనమన్నారు.   బిజెపి నాయకులు, కార్యకర్తలు  అక్రమ అరెస్టులకు  భయపడరని హెచ్చరించారు. కెసిఆర్ పాలనలో సామాన్యులకు నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంతోమంది త్యాగాలతో, బలిదానాలతో, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ పాలన నిజాం నిరంకుశ పాలన తలపిస్తుందని ఆక్రోశం వ్యక్తం చేశారు. సామాన్యుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను  సైతం కెసిఆర్ ప్రభుత్వం హరిస్తుందని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని ఆయన టిఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు.  కూకట్ పల్లి లో టిఆర్ఎస్ నాయకుల ఆగడాలకు  ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు.  లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు, టిఆర్ఎస్ నాయకుడిని అరెస్టు చేసేంత వరకు, భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుందని  ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

అరెస్ట్ అయిన వారిలో ముసాపెట్ కార్పొరేటర్ మహేందర్, బిజెపి నాయకులు శంకర్ రెడ్డి, సురేందర్ రెడ్డి,  వినోద్ గౌడ్, ప్రీతం రెడ్డి,  విజయ్, పులుగొల్ల శ్రీనివాస్, రమేష్, లక్ష్మణ్, నరసారెడ్డి , హరిబాబు, శేఖర్, మనోహర్, ఉదయ్, రవికుమార్ గౌడ్, మహిళా నాయకురాలు స్వరూప గౌడ్, ఉమారాణి, కల్పన, శివరంజని, నాగలక్ష్మి, రేవతి, సులోచన తదితరులు ఉన్నారు.

Related posts

గుంతల రోడ్ల రిపేరుకు చర్యలు

Satyam NEWS

బిజెపి కొమరంభీమ్ జిల్లా మీడియా ఇన్ చార్జిగా ఖండ్రే

Satyam NEWS

కరోనా నియంత్రణలో కేసీఆర్ సర్కారు విఫలం

Satyam NEWS

Leave a Comment