35.2 C
Hyderabad
April 20, 2024 17: 08 PM
Slider ఆదిలాబాద్

రుణమాఫీపై ఎన్నికల హామీ తక్షణమే అమలు చేయాలి

#BJP Kagajnagar

2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుబందు పథకం కింద డబ్బులు ఏ ప్రాతిపదిక రైతుల ఖాతాలో జమ చేశారో, అదే ప్రాతిపదికన ప్రస్తుతం కొత్తగా అర్హులైన వారితో పాటుగా రైతులందరికీ ఇవ్వాలని బిజెపి డిమాండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ సిర్పూర్ అసెంబ్లీ ఇంచార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ కాగజనగర్ RDO, MRO లకు వినతి పత్రం అందించారు.

గత రెండు సీజన్లు, ప్రస్తుత సీజన్ తో కలిపి, ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన విధంగా ఎకరాకు రూ. 5,000/ చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల హామీగా ముఖ్యమంత్రి రైతులందరికీ లక్ష రూపాయల రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేశారని, ఈ ప్రభుత్వం రెండో విడత అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా, నేటికీ రైతు రుణ మాఫీ జరగలేదని అన్నారు.

వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్నారని అందువల్ల లక్ష రూపాయలు కలిగిన రైతు రుణాలను వెంటనే మాఫీచేసి, మళ్లీ కొత్త రుణాలు ఇచ్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

లేకపోతే రైతుతో కలిసి పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు గోలెం వెంకటేష్ , మెడి కార్తిక్, అరుణ్ దొంగరే, గుంమ్ముల సాయి కృష్ణ, మాచర్ల శ్రీనివాస్, చంద్రశాకేర్, షైక్ చంద్, దిలీప్, మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

రోడ్డు భద్రత నిత్య జీవితంలో భాగం కావాలి

Satyam NEWS

ఘనంగా మాజీ భారత ప్రధాని పి.వి.నర్సింహారావు జయంతి

Bhavani

ఎల్బీనగర్ లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్

Satyam NEWS

Leave a Comment