28.2 C
Hyderabad
April 20, 2024 11: 32 AM
Slider ఖమ్మం

సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే పోతిరెడ్డిపాడు జీవో

#BJP Khammam

నీళ్ళు నిధులు నియామకాల ఆకాంక్షల  పునాదుల పై ఏర్పాటైన తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. బీజేపీ తెలంగాణ శాఖ పిలుపు మేరకు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు అక్రమ విస్తరణ ఆపాలని తన గృహం లో బీజేపీ నాయకులతో కలిసి ఆయన దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ సామర్ధ్యాన్ని 40 వేల క్యూసెక్కుల నుండి ఏకంగా 80వేల క్యూసెక్కులకు పెంచుతూ ఆంధ్ర సర్కారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని దీని వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆయన అన్నారు. తెలంగాణ లో కృష్ణా పరివాహక ప్రాంతాన్ని బీడుగా మార్చే ఈ ప్రయత్నం నిలువరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.

రైతులు గగ్గోలు పెడుతుంటే లేఖలు రాసి ఊరుకుంటారా?

రైతులు విపక్షాలు గగ్గోలు పెడుతుంటే ఇరిగేషన్ మంత్రి కృష్ణా బోర్డు కు లేక రాశామని చెప్పడం విడ్డూరమని, ఇప్పటికే లీడింగ్ చానల్ పనులను వేగంగా ఆంధ్ర సర్కారు పూర్తి చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆయన అన్నారు.

పోతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్టు అడ్డుకోలేకపోతే సాగర్ ఎడమ కాలువ పై ఆధారపడిన ఖమ్మం జిల్లా రైతాంగం కూడా తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కృష్ణా పరివాహక రైతుల ప్రయోజనం కాపాడాలని వత్తిడి చేసేందుకే బీజేపీ రైతులకు మద్దతుగా దీక్షలు చేస్తున్నదని ఆయన తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వం వెంటనే లేఖల దుకాణం బంధు చేసి ఎపెక్స్ కౌన్సిల్ లో ఫిర్యాదు చేసి అక్రమ ప్రాజెక్టును ఆపాలని అన్నారు. ఆంధ్ర సర్కారు చేసిన జీవో నంబర్ 203 ను రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గల్లా సత్యనారాయణ జిల్లా ఉపాధ్యక్షుడు వీరెల్లి లక్ష్మయ్య ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూతురు మురళి బీజేవైఎం జిల్లా నాయకులు ఆనంతు ఉపేంద్ గౌడ్ నాయకులు రేగన్ ప్రీతమ్ వీరు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మేడే:జిహెచ్ఎంసి కార్మికులతో సహపంక్తి భోజనం

Satyam NEWS

సంక్షేమ పథకాలు వైఎస్ రాజశేఖరరెడ్డి చలవే

Satyam NEWS

టీఆర్ఎస్ నేతల చెప్పు చేతల్లో తెలంగాణ పోలీసు వ్యవస్థ

Satyam NEWS

Leave a Comment