34.2 C
Hyderabad
April 19, 2024 19: 06 PM
Slider రంగారెడ్డి

ప్రధాన పర్యటన లో నిరసనకారులు ఘటనలో కాంగ్రెస్ కుట్ర

#bandisainjai

పంజాబ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాన్వాయ్ ను నిరసనకారులు అడ్డుకున్న దాని వెనుక మహా కుట్ర ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ కుట్ర కు వ్యతిరేకంగా హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ  శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. చైతన్యపురిలో బీజేపీ ఎస్సీ మోర్చా నిర్వహించిన “మౌన ధర్నా”లో పాల్గొన్న అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

ఇది అనుకోకుండా జరిగింది కానేకాదని ఆయన అన్నారు. ప్రధాని పర్యటన వివరాలు, గైడ్ లైన్సును డిసెంబర్ 30 నాడే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు పంజాబ్  డీజీపీకి పంపించారని తెలిపారు. ప్రధాని పర్యటన రోజు వర్షం పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ నివేదించిందన్నారు.

ఆ రోజు వాతావరణం అనుకూలంగా లేకపోతే రోడ్డు మార్గం ద్వారా ఫిరోజ్ పూర్ వెళతారని, తగిన ఏర్పాట్లు చేయాలని కూడా ఎస్పీజీ నుండి ‘ప్లాన్-బి’ సమాచారాన్ని కూడా పంపిందన్నారు. కానీ పంజాబ్ సీఎం, డీజీపీలు తమకు సమాచారం లేకుండా ప్రధాని అప్పటికప్పుడు రోడ్డు ప్రయాణం పెట్టుకున్నారని చెప్పడం పచ్చి అబద్దమని తెలిపారు.

ఫిరోజ్ పూర్ లో ప్రధానిని అడ్డుకున్న చోటు పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం 15 కి.మీల దూరంలోనే ఉందని దీనిని దృష్టిలో ఉంచుకుని భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీజీ నుండి రాష్ట్రానికి కచ్చితమైన ఆదేశాలు కూడా వెళ్లాయని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల పేర్లను కూడా ఎస్పీజీ పంపిన నోట్ లో  యాడ్ చేశారని స్పష్టం చేశారు.

పాకిస్తాన్ ప్రేరేపితమైన ఖలిస్తాన్ ఉద్యమకారులు కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారని అలాంటి సంస్థలపై  చర్యలు తీసుకోవాలని ముందే డీజీపీకి ఎస్పీజీ అధికారులు లేఖ కూడా రాశారని గుర్తు చేసారు. ఈ విషయంలో ఎస్పీఎఫ్, డీజీపీ మధ్య 10 సార్లకుపైగా ఫోన్ ద్వారా సంప్రదింపులు కూడా జరిగాయని అయిన తరువాత కూడా బ్రిడ్జి మీదకు నిరసనకారులు ఎట్లా వచ్చారు? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

ఓట్ల కోసం కాంగ్రెస్ శవ రాజకీయాలకు చేసే స్థాయికి దిగజారిందని విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ కు వత్తాసు పలుకుతోంది టీఆర్ఎస్ నేతలకు సిగ్గుండాలని ధ్వజమెత్తారు.

Related posts

కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యం

Satyam NEWS

మహిళా పోలీసు వ్యవస్థను మరింత చేరువ చేసిన సచివాలయాలు

Satyam NEWS

అజరామరమైన తెలుగు భాషను అంతం చేయవద్దు

Satyam NEWS

Leave a Comment