27.7 C
Hyderabad
April 24, 2024 10: 36 AM
Slider విశాఖపట్నం

హయాత్ మీటింగ్: ఎట్టకేలకు స్పందించిన బిజెపి

#MLC Madhav

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, బిజెపి నాయకుడు మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కలిసి మాట్లాడుకోవడంపై ఎట్టకేలకు బిజెపి అధికారికంగా స్పందించింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఈ అంశంపై కొన్ని మీడియా ఛానెళ్లు సిసి టివి ఫుటేజి చూపిస్తూ అదే వార్తను పదే పదే ప్రసారం చేస్తున్నాయి. దీనిపై అధికార వైసీపీ తీవ్రమైన వ్యాఖ్యానాలు చేస్తూ ఉన్నది.

తెలుగుదేశం పార్టీ, బిజెపి కలిసి పని చేస్తున్నాయని కొందరు అంటుంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు …. అంటూ వైసీపీ కులాల ప్రస్తావన కూడా తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో బిజెపి స్పందన కోసం ఎదురు చూసిన వారికి నిరాశ కలిగింది. తాజాగా ఈ విషయంపై బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ స్పందించారు.

వారు ముగ్గురు రహస్యంగా కలిశారు అనే అంశాన్ని ఆయన ఖండించారు. వారి ముగ్గురికి వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయని, రాజకీయాలు కోసం అయితే ఎవరికి కనబడకుండా కలిసే వారని ఆయన అన్నారు. ఇదేదో పెద్ద సమస్యల వైసీపీ రాద్దాం చేస్తున్నది అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పటికే దీనికి సంబంధించి సృజన చౌదరి, కామినేని శ్రీనివాసరావు వివరణ ఇచ్చారని ఆయన అన్నారు.

సోషల్ మీడియా పోస్టులు వ్యహరంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక్కోక్కరిపై  ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం ప్రతిపక్షాలు మీద మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారని, స్వపక్షం వారిని వదిలేస్తున్నారని ఆయన అన్నారు. సైబర్ క్రైమ్ కు సంబంధించి చట్టాలును బలోపేతం చేయ్యాలని ఆయన కోరారు.

Related posts

సైబర్ నేరాలపై నాగర్ కర్నూల్ లో అవగాహన

Satyam NEWS

జర్నలిస్టుల పిల్లలకు పాఠశాల   ఫీజులో రాయితీ కల్పించాలి

Satyam NEWS

ఐ టి ఎటాక్: ఇక ఇప్పుడు విజయవాడ డాక్టర్ల వంతు

Satyam NEWS

Leave a Comment