29.2 C
Hyderabad
September 10, 2024 17: 29 PM
Slider కర్నూలు

ఆ వైసీపీ నేతకి బీజేపీ నో ఎంట్రీ .. తిరిగి జగన్‌ గూటికి…?

#Buggana Rajendranath Reddy

జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడంలో భాగమైన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాజాగా బయటికి వచ్చారు. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి సైలెంట్ గానే ఉన్న బుగ్గన ఇప్పుడు హైదరాబాద్ లో తేలారు. ఏపీలో ఆర్థికశాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇది శ్వేతపత్రమా లేక సాకు పత్రమా అని ప్రశ్నించారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం 30 పేజీలకు పైన ఉందని అన్నారు. వైట్‌పేపర్‌లో సమస్యలు చెప్పి, వాటిని తాము ఎలా పరిష్కరిస్తామో చెబుతారని, కానీ ఇది మాత్రం సమస్యలు చెప్పి చేతులెత్తేసి వెళ్లిపోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు.

ఇలా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సడెన్ గా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించడానికి రీజన్ ఉంది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆయన తన వ్యాపారాలు కాపాడుకోవడం కోసం బీజేపీలో చేరదామని చాలా ప్రయత్నాలు చేశారు. తన నియోజకవర్గంలో ఎవరికీ అందుబాటులో ఉండకుండా హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఉండి కేంద్ర పెద్దలను కలుస్తూ వచ్చారు. వారి నిర్ణయం కోసం వేచి చూశారు. బీజేపీ టాప్ లీడర్స్ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో.. ఇతరుల ద్వారా రాయబారం నడిపారని వార్తలు వచ్చాయి.

మొత్తానికి బీజేపీ పెద్దల నుంచి మాజీ మంత్రి బుగ్గనకి బీజేపీ హై కమాండ్‌ నో చెప్పిందని టాక్ వినిపిస్తోంది. అలా బుగ్గనకు రెడ్‌ కార్డ్‌ చూపించడంతోనే బుగ్గన మళ్లీ జగన్ పంచన చేరినట్లుగా చెబుతున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ లో ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి, జగన్ కు అనుకూలంగా మాట్లాడారు.

బుగ్గనకు వైసీపీలో జగన్ మంచి ప్రాధాన్యాన్నే ఇచ్చారు. 2014 ఎన్నికల ముందు జగన్ పర్యటనలో బుగ్గన రాజేంద్రనాథ్‌ పేరునే ఏపీలోనే తొలి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో బుగ్గనకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. కేబినెట్ విస్తరించినా కూడా.. బుగ్గనను మాత్రం కంటిన్యూ చేశారు. అలాంటి బుగ్గన 2024 ఎన్నికల్లో కూడా గెలుపు తనదేనని భావించారు. కానీ, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. అంత ప్రాధాన్యం దక్కినా కూడా బుగ్గన వైసీపీని వీడేందుకు, బీజేపీలో చేరడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మంత్రిగా ఎన్నో వ్యాపారాలను ఏర్పాటుచేసుకున్న బుగ్గన వాటిని విస్తరించుకోవాలంటే.. బీజేపీలో ఉంటే మేలని భావించి అందులో చేరడానికి రెడీ అయ్యారు. చివరికి బీజేపీ పెద్దలు నో చెప్పడంతో జగన్ వద్దనే ఉండాల్సి వచ్చింది.

Related posts

పోచారం మున్సిపాలిటీ లో యథేచ్ఛగా సర్కారు భూములు కబ్జా…

Satyam NEWS

Special interview: ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అవసరమా?

Satyam NEWS

వ్యవస్థీకృత నేరాలపై దృష్టి సారించాలి: డిజిపి

Satyam NEWS

Leave a Comment