31.7 C
Hyderabad
April 19, 2024 01: 15 AM
Slider అనంతపురం

ఏపి, తెలంగాణ సీఎంల మధ్య రహస్య ఒప్పందం

#vishnuvardhan reddy

అన్ని విషయాలలో ఇద్దరు సీఎం ల మధ్య రహస్య ఒప్పందం ఉందని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ, ఏపీ తీసుకుంటున్న నిర్ణయాలతో రాయలసీమకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు.

తెలంగాణ నష్టం జరిగే నిర్ణయాలు తీసుకుంటే ఏపి సీఎం చేతకానితనం తో ఉన్నారని ఆయన విమర్శించారు. రాయలసీమ హక్కులను సీఎం పణంగా పెడుతున్నారని బీజేపీ ఆధ్వర్యంలో అవసరం అయితే శ్రీశైలం ను ముట్టడిస్తామని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.

అనంతపురంలో నేడు జరిగిన మీడియా సమావేశంలో విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. అంతర్ రాష్ట్ర జలవివాదాల పై తక్షణమే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను, విద్యుత్ ఉత్పత్తిని ఎందుకు ఆపడం లేదని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణ లో పార్టీలు కేసీఆర్ విధానాలను తప్పు పడుతుంటే… ప్రభుత్వం ఏం చేస్తోంది. ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నామని ఆయన అన్నారు. రాయలసీమ లో పెండింగ్ ప్రాజెక్టులు, హక్కుల ను సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గాలికి వదిలేశారని ఆయన అన్నారు.

ఇతర పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని, జల వివాదం పై నోరు విప్పాలని బిజెపి డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పై పెత్తనం చేస్తోంది.

అక్కడి ఆస్తులను గాలికి వదిలేశారు. హైదరాబాద్ లో రాజధానిగా ఉమ్మడి హక్కులు ఉన్నాయి. సీమలో ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి ఉద్యమం లోకి రండి..పదవులే కావాలంటే మళ్లీ  ప్రజలు గెలిపిస్తారని ఆయన అన్నారు.

హైదరాబాద్ లో ఆస్తులు కాపాడుకోవడానికి ఏపి ప్రయోజనాలను తాకట్టు పట్టవద్దని ఆయన హెచ్చరించారు.

Related posts

మొక్క‌లు నాటిన స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస‌రావు

Satyam NEWS

జగన్ జైత్రయాత్ర విశేషాలతో పుస్తకం ఆవిష్కరణ…!

Satyam NEWS

పోలీస్ స్టేషన్ లను ఆకస్మిక తనిఖీ చేసిన విజయనగరం పోలీస్ బాస్

Satyam NEWS

Leave a Comment