23.2 C
Hyderabad
September 27, 2023 20: 23 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

తుది శ్వాస విడిచిన బిజెపి సీనియర్ నేత జైట్లీ

arun jaitly

బిజెపి సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్టని క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆయన దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించి తుది స్వాస విడిచారని వైద్యులు తెలిపారు. 2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోదీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది కేంద్రంలో మళ్లీ బిజెపి విజయ ఢంకా మోగించినా, ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలోకి ఆయన చేరలేదు. అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్న ఆయన కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు. అయితే, ఇటీవల జైట్లీ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన ఎయిమ్స్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1952 డిసెంబరు 28న మహారాజ్‌ కిషన్‌ జైట్లీ, రత్నప్రభ దంపతులకు అరుణ్‌ జైట్లీ జన్మించారు. తండ్రి న్యాయవాది. 1960 నుంచి 1969 మధ్య కాలంలో పాఠశాల చదువంతా దిల్లీలోని సెయింట్‌ జేవియర్స్‌ స్కూల్‌లో సాగింది. 1973లో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం 1977లో దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. ఇదే సమయంలో ఏబీవీపీ నిరసనకారుడిగా ఉన్నారు. 1974లో విశ్వవిద్యాలయ విద్యార్థి యూనియన్‌కు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1982 మే 24లో అరుణ్‌ జైట్లీకి సంగీత డోగ్రీతో వివాహం జరిగింది. న్యాయ విద్య పూర్తయ్యాక 1977 నుంచి జైట్లీ సుప్రీంకోర్టు సహా, కొన్ని హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. 1990లో దిల్లీ హైకోర్టులో సీనియర్‌ అడ్వకేట్‌ హోదా లభించింది.1991 నుంచి జైట్లీ భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 1999 అక్టోబరు 13న వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచార ప్రసారశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2000 జులై 23న సామాజిక, న్యాయశాఖ సహాయ మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఏడాది నవంబరులో జైట్లీకి కేబినెట్‌ హోదా దక్కింది. 2009 జూన్‌ 3న రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.

Related posts

ఏడేళ్ల తర్వాత దేశంలో జాతీయ క్రీడలు

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి భార్య, బిడ్డకు గాయాలు

Satyam NEWS

జనగామ సబ్ జైలు లో ఖైదీలకు కరోనా

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!