మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి, శివసేన లకు సంబంధించిన కీలక ఘట్టం ముగిసింది. ఇరు పార్టీలూ తమ తమ అభ్యర్ధుల తుది జాబితా విడుదల చేశాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి 150 స్థానాలలో, శివసేన 124 స్థానాలలో ఇతర మిత్ర పక్షాలు 14 స్థానాలలో పోటీ చేస్తున్నాయి. నేడు నాలుగో జాబితా విడుదల చేసిన బిజెపి తమ పార్టీలోని కళంకిత వ్యక్తులకు టిక్కెట్లు నిరాకరించింది. మొత్తం నలుగురు సీనియర్లకు రిక్తహస్తం చూపించింది. వినోద్ తవ్డే, ప్రకాష్ మెహతా, ఏక్ నాథ్ ఖడ్సే లకు టిక్కెట్లు నిరాకరించడం కీలక అంశం. దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఏక్ నాథ్ ఖడ్సే కు టిక్కెట్ నిరాకరించారు. ఆయనపై పలు ఆరోపణలు పెండింగ్ లోఉన్నాయి. ఆయన కుమార్తె రోహిణికి టిక్కెట్ కేటాయించారు
previous post