విజయనగరం జిల్లాలో బీజేపీ శాఖ… ఇసుమంతైనా ప్రభుత్వ విధానాల అమలులో లోపాలున్నా ఎండగట్టే పనిలో పడుతోంది. తాజాగా జిల్లా కేంద్రంలో డాబా గార్డెన్స్ వద్ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విధానం ద్వారా అందుతున్న బియ్యం పంపిణీ అక్రమంగా రవాణా జరుగుతోందని తెలుసుకున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని నేతృత్వంలో కమలనాథులు సదరు షాపు పై దాడి చేసారు. అక్కడే అక్రమరవాణాను అడ్డుకుని నినాదాలు చేసారు. తక్షణమే ఎమ్మార్వో ప్రభాకరరావు ఘటనా స్థలికి రావాలని బీజేపీ నేత రెడ్డి పావని డిమాండ్ చేసారు.