38.2 C
Hyderabad
April 25, 2024 13: 02 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో బిజెపి శక్తి కేంద్రాల స్ట్రీట్ కార్నర్ కార్యక్రమం

#bjp

భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్రాల స్ట్రీట్ కార్నర్ కార్యక్రమాన్ని ఆదివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం గోపాలపురం గ్రామంలో శక్తి కేంద్ర ఇంఛార్జి కాల్వ వినోద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సూర్యాపేట జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి పాల్గొన్నారు. ఈ భాగ్యరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే ఉచిత విద్య,ఉచిత వైద్యం,అర్హులైన పేదలందరికి ఇళ్ళు,రైతులకు ఫసల్ భీమా యోజన భరోసా ప్రజలకు హామీలు ఇచ్చారు.

సామాన్యుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మా న్  భారత్,ఉచిత వైద్యం,పథకం ప్రజలకు వివరిస్తూ దేశంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధికి నిధులిస్తుంటే బిఆర్ఎస్ ప్రభుత్వం చిల్లిగవ్వ నిధులియ్యకున్నా టెంకాయలు కొట్టడం, తమ నాయకులకు భజనలు చేయటం పరిపాటి అయ్యిందని అన్నారు.

కెసిఆర్  ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు రాలేదని,నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, రైతు బంధు పేరున దొడ్డిదారిన దోచుకున్నారని,ఫసల్ భీమా పథకం అమలు చేయలేదని,ఎరువులు-విత్తనాల సబ్సిడీ అటకెక్కాయని,భూమి రిజిస్ట్రేషన్ చార్జీలను ఎకరానికి 40 వేల రూపాయల పైన పెంచిందని అన్నారు.బస్ చార్జీలు, ఇలా ఎన్నో రకాలుగా పన్నుల రూపంలో దోచుకున్నారని అన్నారు. ఇంటి పన్ను పోటు,కరెంటు బిల్లు గుట్ట చప్పుడు కాకుండా లాగుతున్నారని,డబల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని,మూడెకరాల భూమి మూడున్నాళ్ల ముచ్చటాయ్యే అని,దళిత, గిరిజన బంధు ఢమాల్ చేశారని, వాగ్దానాలతో తెలంగాణ ప్రజానీకాన్ని మోసగించారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్,శక్తి కేంద్రాల అసెంబ్లీ కో-ఆర్డినేట్ కన్వీనర్ అంబళ్ళ నరేశ్ గౌడ్,మండల అధ్యక్షుడు కుందూరు కోటిరెడ్డి,బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

పాత్రికేయులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

లాక్ డౌన్ పేరుతో జర్నలిస్టులను కట్టడి చేయవద్దు

Satyam NEWS

కార్మికుల హక్కులకై పార్టీలకి అతీతంగా పోరాడుదాం: సిఐటియు

Satyam NEWS

Leave a Comment