Slider హైదరాబాద్

పోలీసులకు మాస్కులు పంచిపెట్టిన సుధాకర్ రెడ్డి

Sudhakar Reddy

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కు పూర్తిగా సహకరిస్తూ అహర్నిశలూ పని చేస్తున్న పోలీసులకు మనం ఎంత చేసినా తక్కువేనని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ బిజెపి కోర్ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. నేడు ఆయన హైదరాబాద్ శివారు ప్రాంతమైన మీర్ పేట్ మునిసిపాలిటీలోని బాలాపూర్ లో పోలీసులకు, మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, మీడియా వారికి మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజెస్, తదితర వస్తువులను సుధాకర్ రెడ్డి పంపిణీ చేశారు.

బిజెపి రాష్ట్ర నాయకుడు శంకర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయానికి అందరూ సహకరించాలని సుధాకర్ రెడ్డి కోరారు. కరోనా నిర్మూలించాలంటే స్వీయ నిర్బంధం ఒక్కటే శరణ్యమని ఆయన అన్నారు. ప్రధాని సహాయ నిధికి దాతలు విరివిగా విరాళాలు ఇవ్వాలని ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి కోరారు.

Related posts

కమలం కల నెరవేరేనా?

Satyam NEWS

ఈడీ మరింత శక్తివంతం

Murali Krishna

ములుగు జిల్లాలో ఉపాధి హామీ నిధులతో పక్కా రోడ్లు

Satyam NEWS

Leave a Comment