ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని మంత్రులు ఆర్టీసీ కార్మికుల పై మాట్లాడుతున్నారని ఇది విడ్డూరంగా ఉందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారంనాడు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల కు చివరి వరకు అండగా బీజేపీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కార్మికులు అందరూ సంయమనం పాటించాలని, ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని ఆయన అన్నారు. ఒక్క శ్రీనివాస్ రెడ్డి మాత్రమే కాదని, ఇంకా చాలామంది కార్మికులు గుండె పోటు తో మరణించారని ఈ సందర్భంగా లక్ష్మణ్ వెల్లడించారు. అప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధంగా అణచివేయలని చూసారో అంతకు మించి దారుణంగా ఇప్పుడు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని లక్ష్మణ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య లు చేసుకునేలా చేస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ మొత్తం అమరవీరుల ఆత్మ బలిదనాలతో తడిసి ముద్ద అయిపోయింది. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయాల వల్ల ఆత్మహత్య లు జరిగితే..ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖపు పోకడలవల్ల ఆత్మహత్య లు జరుగుతున్నాయని లక్ష్మణ్ అన్నారు. పోలీస్ బలగాలను అడ్డుపెట్టుకొని కేసీఆర్ కార్మికుల పై ఉక్కుపాదం మోపుతున్నారని, కార్మిక, ఉద్యోగ సంఘాల్లో చీలిక తేవాలని ముఖ్యమంత్రి చూడడం బాధాకరమని ఆయన అన్నారు.
previous post