30.7 C
Hyderabad
April 19, 2024 09: 32 AM
Slider మహబూబ్ నగర్

బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదు

#Gadwala Congress Party

బిజెపి, టిఆర్ఎస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గద్వాల మండల పరిధిలోని జమ్మిచెడు సమీపంలో  కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పటేల్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగులు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ అమలు చేయకుండా ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడగడం సిగ్గు చేటు అని ఆరోపించారు. రైతులకు వ్యతిరేకంగా చట్టాలను అమలు చేసి కార్పోరేట్ కంపెనీలకు అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజులలో పేద ప్రజల  ఖాతాలో  రూ15లక్షలు జమా చేస్తామని ఇచ్చిన హామీ తుంగలో తొక్కి ఈరోజు మతతత్వ రాజకీయలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్,డీజిల్,పెట్రోల్ ధరలు పెంచుతూ పోతూ,ప్రభుత్వ సంస్థలను ప్రవేట్ సంస్థలు గా మారుస్తున్న ఘనత బిజెపి కి దక్కుతుందని ఆరోపించారు.

ఈ రోజు దేశ జిడిపి తగ్గుతున్న పట్టించకుండా మతతత్వ రాజకీయలు చేస్తు అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు అమలు చేయకుండా,150,000 లక్షల ఉద్యోగులు భర్తీ చేస్తామని ఇచ్చిన మాట తుంగలో తొక్కి ఈ రోజు ఏ ముఖంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడుగుతున్నరని ఎద్దేవా చేశారు.

ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి,హైదరాబాద్ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి చెన్నారెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా,ఒక సారి మంత్రిగా బాధ్యత చెప్పట్టారు. ప్రజల పక్షాన ఉంటూ, విద్యార్థుల, నిరుద్యోగుల,సమస్యలపై గళం విప్పుతూ పరిష్కారానికి కృషి చేసిన వ్యక్తి చెన్నారెడ్డి అని గుర్తు చేశారు.బిజెపి,టిఆర్ఎస్ పార్టీలకు ఓటు అడిగే హక్కు లేదని మండిపడ్డారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సీనియర్ కౌన్సిలర్ శంకర్, సీనియర్ కౌన్సిలర్ ఇసాక్, మల్దాకల్ మండల అధ్యక్షులు నల్లారెడ్డి, సోషల్ మీడియా ఇంఛార్జి  జమాల్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దినేష్ మైనార్టీ నాయకులు కౌసర్ బెగ్, శబాఖత్ కార్యకర్తలు  పాల్గొన్నారు.

Related posts

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సజీవ దహనం?

Satyam NEWS

రివర్స్ టెండరింగ్ వల్ల పెరుగుతున్న కరెంటు చార్జీలు

Bhavani

ఐజ తిరుమల్ రెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

Leave a Comment