33.2 C
Hyderabad
April 26, 2024 02: 58 AM
Slider సంపాదకీయం

కమలానికి చెమట పట్టకుండా తిరుగుతున్న ఫ్యాను

#BJP

ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఎలా తగ్గించాలి? మరీ ముఖ్యంగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రశ్నకు బిజెపి, వైసీపీలు భారీ కసరత్తే చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది.

ఇంత కాలంగా ఒకరి నొకరు పెద్దగా తిట్టుకోని బిజెపి వైసీపీ నాయకులు ఇప్పుడు బాహాటంగా తిట్టుకుంటున్నారు. వైసీసీ వారు బిజెపి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి తెలుగుదేశం పార్టీని పలుచన చేయాలని చూస్తుంటే ఇదే మంచి అదను అంటూ బిజెపి కూడా వైసీపీపై ఒంటికాలుతో లేస్తున్నది.

వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేసినా మాట్లాడని బిజెపి నేతలు ఇప్పుడు కూడా వైసీపీ వ్యూహానికి అనుగుణంగా పని చేసుకుంటూ పోతున్నారు. ఇందుకు వేదికగా ట్విట్లర్ వారిద్దరికి ఉపయోగపడుతున్నది. జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ను వచ్చే ఎన్నికలో ఏపీకి సీఎం ని చేయాలని  ఏపీ బీజేపీ అధ్యక్షుడు సొమ్ము వీర్రాజు మాట్లాడిన మాటలకు ”తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు.

ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు.  ఎవరి పాత్రల్లో వారు జీవించండి…చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం  మళ్లీ వైసీపీనే  దీవిస్తారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో విపక్ష పార్టీల అభ్యర్థులే చేతులెత్తేస్తుంటే వారికి జాకీలుపెట్టి ఎలా లేపాలో అర్థంకాక సతమతమవుతోంది పచ్చ కుల మీడియా.

ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు. మీరెన్ని చేసినా డిపాజిట్లు వస్తే చాలాఎక్కువ” అని వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి ట్విట్టర్ లో విచ్చలవిడిగా కామెంట్లు పెట్టేశారు. దీనికి సొమ్ము వీర్రాజు సమాధానం ఇచ్చారు.

 ”మా ఊసు ఎందుకులే ఎంపీ విజయ సాయి రెడ్డి గారూ..!!! కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో  తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా. తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజి పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి.” అని కౌంటర్ ఇచ్చారు.

రాష్ట్రంలో దేవాలయాలు ధ్వంసం చేస్తున్నా ఉలకని పలకని బిజెపి నేతలు ఉప ఎన్నిక రాగానే ఊగిపోతున్నారని జనం కామెంటు చేసుకుంటున్నారు.

Related posts

సర్వ మతాలకు ప్రాధాన్యతనిచ్చిన సీఎం

Sub Editor

ఫిట్ ఇండియా కోసం భారీ సైకిల్ ర్యాలీ

Satyam NEWS

డిస్నీ+ హాట్‌స్టార్ లో ప్రసారం కానున్న ‘ఆర్ యా పార్’

Bhavani

Leave a Comment