ఓడిపోయిన కౌన్సిలర్ అభ్యర్థులు అధైర్య పడవద్దని రాబోయే కాలం బిజెపిదేనని నిర్మల్ మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్, జిల్లా ఉపాధ్యక్షుడు మంజు కుమార్ రెడ్డి అన్నారు. నేడు నిర్మల్ మున్సిపాలిటీ బిజెపి ఎన్నికల సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కేంద్ర విత్తన పాలక మండలి సభ్యులు అయ్యన్నగారి భూమయ్య ,కృష్ణా గోదావరి జలాల రాష్ట్ర కన్వీనర్ రావుల రాంనాథ్ తదితరులు పాల్గొన్నారు. మహాలక్ష్మి టెంపుల్ సమీపంలో గల గంగారెడ్డి తోటలో జరిగిన ఈ సమావేశానికి పెద్ద ఎత్తున బిజెపి నాయకులు హాజరయ్యారు. ఈ సమీక్షా సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకుని మునుముందు జరిగే ఎన్నికల్లో ఎలా వ్యూహ రచనలు చేయాలన్నది నిర్ణయించుకుంటామని చెప్పారు. పట్టణ అభివృద్ధి కోసం ఎంపి లాడ్స్ కింద నిధులు కేటాయించి నిర్మల్ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఒడిసెల శ్రీనివాస్ ,జిల్లా ఉపాధ్యక్షుడు ఆడెపు సుధాకర్ ,బిజెపి దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు రాచకొండ సాగర్ ,పట్టణ అధ్యక్షుడు అయ్యన్నగారి రాజేందర్ నాయకులు’తోట సత్యనారాయణ శ్రీ గాదే విలాస్ సాదం అరవింద్ కౌన్సిలర్ అభ్యర్థులు మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.