39.2 C
Hyderabad
March 29, 2024 13: 18 PM
Slider నిజామాబాద్

బీజేవైఎం ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళనలు

#BJYMJukkal

బీజేవైఎం రాష్ట్ర శాఖ అధ్యక్షులు భానుప్రకాశ్ ఇచ్చిన పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని అయా మండలాల తహసీల్దార్   కార్యలయాల ముందు ఆయా మండలాల బీజేవైఎం నాయకులు కార్యకర్తలు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు చేశారు.

ఈ సందర్బంగా బిచ్కుంద లో   బిజెవైఎం నాయకులు విష్ణు మాట్లాడుతూ  తెరాస ప్రభుత్వం నిరుద్యోగుల భృతి ఇవ్వకుండా జాప్యం చేయడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదని ఆయన ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లేకపోవడంతో సీనియర్ సహాయకులు రాచప్పకు మూడు డిమాండ్లతో కూడిన వినతిపత్రం సమర్పించారు.

డిమాండ్లు 

1)రైతులకు ఎక కాలంలో రైతు లకు రుణ మాఫీ చేయాలి.

2)సన్న రకం పండించిన రైతులకు మద్దతు ధర 2500 లు ప్రకటించాలి.

3)టిచర్లకు,ఉద్దోగులకు న్యాయంగా దక్కాల్సిన ఐఆర్,పి ఆర్ సి,సర్విస్ రూల్స్ పలు సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో బిచ్కుందలో విష్ణుతోపాటు జుక్కల్ బీజేవైఎం అధ్యక్షులు  ప్రశాంత్ పటేల్, మద్నూరులో బీజేవైఎం  అధ్యక్షుడు  చంద్రకాంత పటేల్ తో పాటు  ఆయా మండలాల బీజేవైఎం  నాయకులు కార్యకర్తలు భాజపా శ్రేణులు ఉన్నారు.

Related posts

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ

Satyam NEWS

ఒకే ఒక్క ఫోన్ కాల్ తో క‌దిలిన ట్రాఫిక్, మున్సిప‌ల్ శాఖ‌లు

Satyam NEWS

ఎలక్షన్ ట్రిక్స్:బీజేపీ అభ్యర్థి బీ ఫారంను చింపేసాడు

Satyam NEWS

Leave a Comment