34.2 C
Hyderabad
April 19, 2024 19: 40 PM
Slider హైదరాబాద్

పార్కును కాపాడని అధికారులకు ప్రజల నిరసన

#KPHBColony

హైదరాబాద్ లో ప్రతిష్టాత్మకమైన కె. పి .హెచ్. బి  114 డివిజన్ కాలని లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టని అధికారులపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్నది.

రెండు సంవత్సరాల కిందట శంకుస్థాపన చేసిన కేటీఆర్ పార్క్ అడవి ప్రాంతంలా మారడంపై బీజేవైఎం నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

కె. పి .హెచ్. బి కాలనీ 3వ ఫేజ్ రమ్య గ్రౌండ్ లో కులిన ప్రహరి  గోడ ను నిర్మించకపోవడంపై కూడా బీజేవైఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

అక్కడి చైతన్య ఫుడ్ కోర్టు ప్రక్కన మురికినీరు నిల్వ ఉండడం వల్ల ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.

అంతే  కాకుండా  4వ ఫేస్ లో  క్రీడా ప్రాంతం లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బి.జే.వై.యం. ఎస్. ప్రితం రెడ్డి, డివిజన్ నాయకులు  శ్రీనివాస్ తేజ రెడ్డి,  గురువా ప్రసాద్ రెడ్డి, మక్డుం, కోటేశ్వర రావు, వెంకట్ రెడ్డి,

మహిళ అధ్యక్షురాలు నాగ లక్షి, వర లక్ష్మి రేవతి, దుర్గా, యువమొర్చ నాయకులు, నాయకురాళ్ల ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

వయసులో మైన‌ర్లు…జల్సాల కోసం దొంగ‌త‌నాలు…!

Satyam NEWS

దోచుకో నా రాజా: నకిలీ పత్తి విత్తనాల వెల్లువ

Satyam NEWS

అదిలాబాద్ జిల్లాలో గుట్కా రాకెట్ ను ఛేదించిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment