27.7 C
Hyderabad
April 24, 2024 10: 35 AM
Slider జాతీయం

దొరికిన బ్లాక్ బాక్స్.. ఘటనపై కీలాకాధారాలు లభ్యం

హెలికాఫ్టర్‌ కూలిన ప్రాంతానికి 30 అడుగుల దూరంలో బ్లాక్‌బాక్స్‌ను గుర్తించిన అధికారులు.. బ్లాక్‌ బాక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డీకోడింగ్‌కు ఢిల్లీ లేదా బెంగళూరుకు తరలించే అవకాశముంది. ప్రమాద స్థలంలో బ్లాక్‌ బాక్స్‌తో పాటు మరో 3 ఇతర వస్తువులను సేకరించారు.

అయితే అసలు ఆ బ్లాక్‌బాక్స్‌లో ఏముంది..? ప్రమాదానికి ముందు అసలు ఏం జరిగింది..? పైలట్‌ బిపిన్‌ రావత్‌తో ఏం మాట్లాడారు..? ప్రమాదం జరిగిన సమయంలో ATCతో కాంటాక్ట్‌ అయ్యే ప్రయత్నం చేశారా..? అసలేం జరిగిందన్నది ఆ బ్లాక్‌ బాక్స్‌ ద్వారా పూర్తి సమాచారాన్ని సేకరించనున్నారు.

ఆ బ్లాక్‌ బాక్స్‌ను డీకోడింగ్‌ చేస్తే ప్రమాదానికి అసలు కారణమేంటన్న అంశంపై క్లారిటీ రానుంది. IAF చీఫ్‌ ఎయిర్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి కూనూర్‌లో హెలికాఫ్టర్‌ ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబుతో కలిసి ఆ ప్రాంతాలను పరిశీలించారు. ఫోరెన్సిక్‌ నిపుణులు కూడా ఆ ప్రాంతంలో ఆధారాలను సేకరించారు.

Related posts

రైతు సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

Satyam NEWS

మూడు చిత్రాలను ప్రకటించిన వ్యాపారవేత్త సురేష్‌రెడ్డి

Satyam NEWS

పంచాయితీ ఎన్నికలు: మద్యం నియంత్రణకు ప్రత్యేక కంట్రోల్ రూం

Satyam NEWS

Leave a Comment