39.2 C
Hyderabad
April 23, 2024 18: 31 PM
Slider మెదక్

నేడు బ్లాక్ డే సందర్భంగా సిఐటియు నల్లజెండాలతో నిరసన

#Siddipet

సిఐటియు, రైతుసంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లాలో నేడు బ్లాక్ డే నిర్వహించారు.

దుబ్బాక మండల కేంద్రంతో పాటు లచ్చపెట, ఆకారం, రఘోత్తంపల్లి, గోసాన్ పల్లి, గంభీర్ పూర్,అప్పనపల్లి, గుండవెళ్ళి, అసన్ మీరాపూర్, గ్రామాలలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలోని  బిజెపి ప్రభుత్వం కార్మిక,రైతు, వ్యతిరేక విధానాలతో దేశాన్ని పూర్తిగా వ్విచ్చిన్నం చేస్తోందని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలను, విద్యుత్ 2020 సవరణ బిల్లును, కార్మికులకు వ్యతిరేకమైన నాలుగు కార్మిక కొడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఆరు నెలల నుండి దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంలో రైతులు అనేక పోరాటాలు చేస్తున్నా బిజెపి ప్రభుత్వానికి కనీసం చలనం లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.

దేశంలో శాంతియుతంగా పోరాటం చేస్తున్న రైతులు సుమారుగా 400 మంది వరకు మరణించారని ఇంత మంది రైతులు మరణించినా కేంద్ర ప్రభుత్వానికి కనీసం చలనం లేకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు.

రైతులు పోరాటం చేస్తున్న న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేసి రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని కోరారు. అదేవిధంగా కార్మిక వ్యతిరేక కోడ్ల ను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

వీరితో పాటు కేంద్రంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం వలన దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోతుంది తప్ప అభివృద్ధి కాదని దుయ్యబట్టారు. దేశంలో కరోనా విస్తరిస్తున్న సందర్భంగా దేశ ప్రజలకు ఆరోగ్యం పట్ల ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన దానిని పూర్తిగా విస్మరిస్తూ ఐదు రాష్ట్రాల ఎన్నికలు, కుంభమేళాలు తప్ప ప్రజల ప్రాణాలను కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రిలో అక్రమ దోపిడీని అరికట్టే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కరోనా నిర్మూలన కొరకు గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు, మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఇతర ప్రభుత్వ  భవనాలను ఐసోలేశన్ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు.

ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, ఉపాధిహామీ 200 రోజులకు పెంచి ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి పట్టణాలకు కూడా విస్తరించాలని  డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఎస్ చంద్రారెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం డి సాదిక్, నాయకులు తడ్క లచ్చయ్య, బత్తుల రాజు,పరుశరాములు, ఎల్లం,కిషన్,చంద్రం,దుబ్బరాజన్న, బాలరాజు,కనకయ్య,మైసయ్య, పోచయ్య,శంకర్, నర్సింలు,రాజు, శ్రీశైలం,భాను,మంజుల,పద్మ, లావణ్య,తదితరులు పాల్గొన్నారు.

Related posts

పదో తరగతి విద్యార్థులకు రోజూ రెండు గంటలు ప్రత్యేక తరగతులు

Satyam NEWS

పీయూష్ గోయల్ పై టీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్ నోటీస్

Sub Editor 2

వనపర్తి జిల్లా కేంద్రంలో పోలీసుల రక్తదాన శిబిరం

Bhavani

Leave a Comment