34.2 C
Hyderabad
April 23, 2024 12: 37 PM
Slider గుంటూరు

గుంటూరులో రెమిడిస్వేర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ దందా

#remdesivir

కరోనా రోగుల ఆతృతను యథేచ్ఛగా సొమ్ము చేసుకుంటున్నారు కొందరు దొంగ వ్యాపారులు. రెమిడిస్వేర్ ఇంజక్షన్లు అనుమతి ఉన్న ఆస్పత్రులకు మాత్రమే సరఫరా అవుతుంది.

అనుమతి లేని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న  పేషంట్ల అవసరాన్ని ఆసరాగా  చేసుకోని వీటిని బ్లాక్ మార్కెట్ లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

ఈ ముఠాను పట్టుకోవడానికి గుంటూరు అర్బన్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు.

కొత్తపేట CI రాజశేఖర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి కోవిడ్ బాధితులులాగా అంకమ్మరావు అనే వ్యక్తిని సంప్రదించగా అతను ఒక్కొక్క రెమిడిస్వేర్ ఇంజక్షన్ ను 38 వేల రూపాయల చొప్పున 6 ఇంజక్షన్లకు రూ. 2,28,000లకు అమ్మేoదుకు  ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇంజక్షన్ డెలివరీ ఇచ్చే సమయంలో అంకమ్మరావు ని అదుపులోకి తీసుకొని విచారించగా అతను రత్నరాజు అనే అతని వద్ద  ఒక్కొక్క ఇంజక్షన్ 34 వేల రూపాయల చొప్పున కొనుగోలు చేసి 4 వేల రూపాయలు లాభానికి అమ్ముతున్నట్టు చెప్పాడు.

దాంతో రత్నరాజు ని అదుపులోకి తీసుకొని విచారించగా తాను నూనె గుర్నధం వద్ద 26 వేల రూపాయలకి  కొనుగోలు చేసి 34 వేల రూపాయలకి అమ్ముతున్నట్టు అంగీకరించాడు.

దాంతో నూనె గుర్నాదo ఎలియాస్ నాని ని అదుపులోకి తీసుకొని విచారించగా  తాను పనిచేస్తున్న కిడ్నీ కేర్  హాస్పిటల్ లోని శివ మెడికల్స్ ఫార్మసీస్ట్ పేరం చంటి  అనే అతని నుండి అదే హాస్పిటల్ లో పని చేస్తున్న కృష్ణవేణి ద్వారా ఒక్కొక్క ఇంజక్షన్ ని 20 వేల  రూపాయల చొప్పున కొనుగోలు చేసి 6 వేల రూపాయలు లాభానికి అమ్ముతున్నట్టు అంగీకరించాడు.

సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 6 రెమిడిస్వేర్ ఇంజక్షన్లను స్వాధీనపరుచుకొని నిందితులను అరెస్ట్ చేశారు.

Related posts

ఎలిగేషన్: చంద్రబాబునాయుడు ప్రజావ్యతిరేకి

Satyam NEWS

చంద్రబాబునాయుడి మళ్లీ యూ టర్న్

Satyam NEWS

ఛలో నర్సీపట్నం… ఎక్కడిక్కడే టీడీపీ నేతలు హౌస్ అరెస్టు

Satyam NEWS

Leave a Comment