27.7 C
Hyderabad
March 29, 2024 04: 40 AM
Slider ప్రపంచం

యుద్ధ నౌకలో పేలుడు: ముగ్గురు నావికుల మృతి

#INSranveer

ముంబయి తీరంలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఉన్న భారత యుద్ధనౌకలో పేలుడు సంభవించి ముగ్గురు భారత నౌకాదళ సిబ్బంది మరణించారు. యుద్ధనౌకలో ఉన్న మరో పది మంది గాయపడి ముంబైలోని నావల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులు ముగ్గురూ నావికులే. ఐఎన్‌ఎస్ రన్‌వీర్‌ అనే ఈ యుద్ధ నౌకలోని అంతర్గత కంపార్ట్‌మెంట్‌లో పేలుడు సంభవించిందని భారత నౌకాదళం తెలిపింది. ‘అంతర్గత కంపార్ట్‌మెంట్’ అంటే ఓడలో ఉన్న అనేక కంపార్ట్‌మెంట్లలో ఒకటి. పేలుడుకు కారణమేమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. కారణాలపై విచారణకు బోర్డు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించారు. పేలుడు సంభవించిన వెంటనే నావికాదళ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. యుద్ధనౌకలో పెద్దగా నష్టం జరగలేదు. INS రణవీర్ గత సంవత్సరం నవంబర్ నుండి తన పనులను ప్రారంభించింది. 147 మీటర్ల పొడవున్న ఈ యుద్ధనౌక పూర్తిగా లోడ్ అయినప్పుడు 4,900 టన్నుల బరువు కలిగి ఉంటుంది.

Related posts

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన హీరో శర్వానంద్

Satyam NEWS

ఆ పుస్తకాన్నిపిల్లలే కాదూ పెద్దలూ చదవాల్సిందే!

Sub Editor

రియా చక్రవర్తి బెయిల్ తిరస్కరించిన న్యాయస్థానం

Satyam NEWS

Leave a Comment