37.2 C
Hyderabad
March 29, 2024 17: 33 PM
Slider వరంగల్

శాల్యూట్: రక్తదానం చేసిన వెటర్నరీ డాక్టర్లు

vetarnary doctors

ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భం పురస్కరించుకొని శనివారం ఉదయం జనగామ జిల్లా వెటర్నరీ వైద్యులు రక్తదానం చేసారు. రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో జిల్లా పశు వైద్యాధికారి డా.మాచర్ల బిక్షపతి అధ్యక్షతన స్థానిక రక్తనిధి కేంద్రంలో నిర్వహించిన శిబిరంలో పాల్గొన్న రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ డి. లవకుమార్ రెడ్డి మాట్లాడుతూ త్యాగానికి ప్రతీకైన రక్తదానం చేయడం వల్ల మంచి ఆరోగ్యవంతులు గా ఉంటారని అన్నారు.

ఈ రోజు రక్తదానం చేసిన 20 యూనిట్ల లో పది మంది వైద్యులు ఉన్నారు. స్వయంగా రక్తదానం చేసి శిబిరాన్ని ప్రారంభించిన సహాయ సంచాలకులు డా. యారవ నర్సయ్య మాట్లాడుతూ లాక్ డౌన్ కాలంలో విధులు నిర్వహిస్తూనే రక్తదానం చేసిన సిబ్బందిని అభినందించారు. డా. సతీశ్, డా. వినయ్, డా. సునీల్, డా. శ్రీనివాస్, డా. అశోక్ రెడ్డి, డా. ఉపేందర్, డా. రవిప్రసాద్ రక్తదానం చేశారు.  ఆసుపత్రి అర్. ఎం. ఓ. డా. సుగుణాకర్ రాజు, బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ ఎస్. రాంనర్శయ్య, రెడ్ క్రాస్ కార్యదర్శి కన్న పరశురాములు దాతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేసారు. ఇంకా జూనియర్ వెటర్నరీ అధికారి శ్రీధర్ బాబు, ప్రవీణ్ కుమార్ తదిరులు పాల్గొన్నారు.

Related posts

నేడు చదువుల తల్లి సావిత్రి బాయి ఫూలే జయంతి

Satyam NEWS

దేశంలో మొట్టమొదటి సారిగా లైవ్ లో కోర్టు ప్రొసీడింగ్స్

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం రాజీవ్ స్టేడియంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే .!

Satyam NEWS

Leave a Comment