30.7 C
Hyderabad
April 19, 2024 09: 36 AM
Slider ముఖ్యంశాలు

వైద్యశాలలో స్కానింగ్ సెంటర్,రక్త నిధి కేంద్రం ఏర్పాటు చేయాలి

#DSRTrust

హుజుర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రం, స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం డిఎస్ఆర్ ట్రస్ట్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ హుజూర్ నగర్ లో ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో  స్కానింగ్ సెంటర్ లేక కోదాడ ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ లకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన  పరిస్థితి వస్తుందని, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్ సమయంలో రక్తం అవసరం అయినప్పుడు రక్త నిధి సెంటర్ లేకపోవడంతో ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుందని కనుక సంబంధిత  అధికారులు వెంటనే స్పందించి హుజూర్ నగర్ ప్రభుత్వ వైద్యశాలతో స్కానింగ్ సెంటర్, రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ములకలపల్లి శీను,ములకలపల్లి రాంబాబు, దగ్గుపాటి సత్యానందం,చింతమల్ల ప్రసాద్,  కస్తాల దిల్, నూకతొట్టి ప్రమోద్ కుమార్,దగ్గుపాటి రాజేష్, ఎద్దుల నరసారావు, పాషా,వీరబాబు, శివ, లచ్చిమల్ల సైదులు, సుందర్, సురేష్, అబ్రహం, సైదులు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

ఏప్రిల్‌ 11: జగన్ మంత్రివర్గం పునర్వవస్థీకరణకు ముహూర్తం ఫిక్స్

Satyam NEWS

2000 నోటుతో లాభ సాటి వ్యాపారం

Satyam NEWS

మోడీ పాలనలో బీడీ కార్మికుల బతుకులు ఆగం

Bhavani

Leave a Comment