38.2 C
Hyderabad
April 25, 2024 14: 32 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ లో స్కానింగ్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి

#HujurnagarCongressParty

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఇందిరా భవనంలో ఆదివారం జరిగిన సమావేశంలో TPCC రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎండీ అజీజ్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా చాలా ఏరియా వైద్య శాలలో మెరుగైన వైద్యసేవలు అందించటానికి ఎక్విప్మెంట్స్ లేకపోవటం విచారకరమని అన్నారు.ప్రభుత్వం కొన్ని దుబారా ఖర్చులు బంద్ తీసుకొని వైద్య రంగానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ  ప్రభుత్వ వైద్య శాలల సౌకర్యాల కల్పనకు బడ్జెట్ రూపొందించాలని కోరారు.

హుజూర్‌నగర్ పట్టణంలో గల  ప్రాంతీయ వంద పడకల ఏరియా హాస్పిటల్ లో ముఖ్యముగా గర్భిణీ స్త్రీలకు  స్కానింగ్ సెంటర్ లేకపోవటంతో ఈ ప్రాంతం లోని  మహిళలు  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంఘటనలు అనేకంగా జరుగుతున్నాయని అన్నారు.దూర ప్రాంతాలకు వెళ్లి స్కానింగ్ చేయించుకోవటానికి ఆర్థిక ఇబ్బందులతో పాటు రవాణా  రాకపోకలతో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని అన్నారు.

ముఖ్యంగా ఈ ప్రాంతం ట్రైబల్ ఏరియా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఆర్థిక  వెసులుబాటు లేక ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్లి స్కానింగ్ చేయించుకోవటానికి ఇబ్బందులు పడుతున్న సంఘటనలు అనేకం ఎదురవుతున్నాయని,గర్భిణీ మహిళలు ప్రతి మూడు నెలలకో సారి నేటి పరిస్థితుల దృష్ట్యా డాక్టర్ల సలహా మేరకు స్కానింగులు చేయించుకుంటున్నారని, తొమ్మిది నెలల కాలంలోనే వేల రూపాయలు స్కానింగ్ చేయించుకున్నందుకు   ఖర్చు అవుతున్నాయని అన్నారు.

ప్రభుత్వ వైద్య శాలలో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే గర్భిణీ మహిళలకు ఆర్థికంగా భారం నుండి ఉపశమనం కలుగుతుందని,ఈ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లేకపోవటం వలన ప్రమాదాలు సంభవించినప్పుడు లేదా,ఏదైనా అత్యవసరంగా సిజేరియన్  చేసినప్పుడు కొంతమందికి రక్తం సరిపడా లేకపోవటం వలన ఆ సమయంలో  

బ్లడ్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. సరి అయిన సమయంలో రక్తం అందక పోవటం వలన కొన్ని ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్కానింగ్ సెంటర్,బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఎండీ అజీజ్ పాషా  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరారెడ్డి, మేళ్లచెర్వు ముక్కంటి,పాశం రామరాజు,కస్తాల ముత్తయ్య, దొంతగాని జగన్, జానయ్య, ధన మూర్తి,S. కోటేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆఫ్టర్ కరోనా: కార్పొరేట్ కాలేజీలు మూతపడటం ఖాయం

Satyam NEWS

రిక్వెస్టు: నా పుట్టిన రోజు సంబరాలు జరపవద్దు

Satyam NEWS

శబరీ నదిలో మునిగిపోయిన లాంచీ

Satyam NEWS

Leave a Comment