34.2 C
Hyderabad
April 19, 2024 19: 56 PM
Slider నల్గొండ

రక్తదానంతో ప్రాణం నిలిపిన జన చైతన్య ట్రస్ట్

#janachitanyatrust

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని జనచైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో 70 సంవత్సరాల భద్ర అనే వ్యక్తికి రక్తం అత్యవసరం కాగా  మంగళవారం రక్తదానం చేసి మానవతకు ప్రాణం పోసింది.

కోదాడ నియోజకవర్గ కేంద్రంలోని ప్రయివేట్ హాస్పిటల్ లో 70 సంవత్సరాల భద్ర అనే వ్యక్తికి ‘ఓ’ పాజిటివ్ రక్తం అవసరమని హుజూర్ నగర్ పట్టణంలోని జనచైతన్య ట్రస్ట్ ను సప్రదించగా ట్రస్ట్ నిర్వాహకుడు,చైర్మన్ పార సాయి వంశీ,శివశంకర్ లు తక్షణమే స్పందించి డోనర్స్ ను సంప్రదించి తగిన ఏర్పాటు చేసి, ట్రస్ట్ సభ్యుడు పార సాయి తన మిత్రుడు హుజూర్ నగర్ కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి తో మాట్లాడి హాస్పిటల్ వద్దకు వెళ్లి ‘ఓ’ పాజిటివ్ రక్తం దానం చేశారు.

ఈ సందర్భంగా జనచైతన్య ట్రస్ట్ చైర్మన్ పారా సాయి మాట్లాడుతూ తమ ట్రస్ట్ తరుపున 234 వ,వ్యక్తికి రక్తదానం చేసిన మధుసూదన్ రెడ్డి ని మనస్పూర్తిగా అభినందించారు. ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ మనమిచ్చే రక్తం – మరొకరికి జీవితాన్ని ఇస్తుందని, ఒకరి దానం – మరొకరికి ప్రాణం ప్రాణదానం ఔతుందని,రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని కోరారు. రక్తం అవసరం ఉన్నా ప్రతి ఒక్కరికి జనచైతన్య బ్లడ్ డొనేషన్ టీం అన్ని వేళల అందుబాటులో ఉంటుందని అన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

భూయాన్, భట్టి ల పదోన్నతులకు కోలేజియం సిఫార్సు

Bhavani

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కల్నల్ సంతోష్ సంతాప సభ

Satyam NEWS

గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

Sub Editor 2

Leave a Comment