36.2 C
Hyderabad
April 23, 2024 21: 16 PM
Slider నల్గొండ

రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్న యువకులు

#BloodDonationCamp

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ సర్కిల్ పరిధిలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో హుజూర్ నగర్ సర్కిల్ పరిధిలోని హుజూర్ నగర్, మఠంపల్లి, గరిడేపల్లి, నేరేడుచర్ల, పాలకీడు మండలాల నుండి యువకులు చాలా ఉత్సాహంగా పాల్గొని,రక్త దానం చేశారు.

ఈ సందర్భంగా సి.ఐ రాఘవ రావు మాట్లాడుతూ విధినిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.

యువత దాదాపు వంద మందికి పైగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసినందుకు వారికి పోలీసుల తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవళిక మాట్లాడుతూ కరోన నేపథ్యంలో గర్భిణీ స్త్రీలు,ఇతర అనారోగ్యాలతో బాధపడే వారికి అత్యవసర సమయంలో రక్తం అందక చాలా ఇబ్బందులు పడ్డారని తెలిపారు.

ప్రస్తుతం హుజూర్ నగర్ సర్కిల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రక్తదాన క్యాంపులో నియోజకవర్గ అన్ని మండలాల నుండి వచ్చిన యువకుల నుండి దాదాపుగా 100 యూనిట్ల రక్తాన్ని సేకరించామని, దానికి యువకులు ముందుకు రావడం హర్షించదగిన విషయం అని అన్నారు.

ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తాన్ని ఇవ్వవచ్చునని తెలియజేశారు.

Related posts

అయోధ్య రామాలయం కోసం రఘురాముడి ప్రత్యేక పూజ

Satyam NEWS

ఉత్తమ గ్రామ పంచాయతీగా వాజిద్ నగర్

Satyam NEWS

వితంతు పెన్షన్ పేరు మార్చాలి

Satyam NEWS

Leave a Comment