28.7 C
Hyderabad
April 24, 2024 03: 22 AM
Slider ఆదిలాబాద్

కాగజ్ నగర్ లో ఉచిత రక్తహీనత శిబిరానికి విశేష స్పందన

#HealthCamp

కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో IMA ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ ఆధ్వర్యంలో ఉచిత రక్త హీనత శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

కిమ్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఈ ఉచిత రక్తహీనత శిబిరం ఏర్పాటు చేయగా దాన్ని ఉమెన్స్ డాక్టర్స్ వింగ్ చైర్మన్ డాక్టర్ కొత్తపల్లి అనిత ప్రారంభించారు.

ఈ శిబిరంలో 65 మందికి పరీక్షలు నిర్వహించారు. వారికి కావల్సిన మందులు అందించి వ్యాధి పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు.

అదేవిధంగా వారు మాట్లాడుతూ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా కూడా ఇలాంటి శిబిరాన్నే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

నేటి నుంచి 8వ తేదీ వరకూ సిర్పూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉచిత రక్తహీనత శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ అవకాశాన్ని మహిళలు అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ చెర్మెన్ డా.జ్యోతి , డా.ఉదయభాను, డా.రమాకాంత్, డా.హసీబీ ఉల్ హుక్, డా.సత్యనారాయణ కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సీబీఐ కి సహకరించని కర్నూలు ఎస్పీ: టీడీపీ

Satyam NEWS

వచ్చే ఉగాదికి ‘టీఎఫ్‌సీసీ-నంది సౌత్‌ ఇండియా ఫిలిం అవార్డ్స్‌

Bhavani

సీఎం నిబంధనలను అతిక్రమిస్తుంటే ఐఏఎస్  అధికారులు ప్రశ్నించరా?

Satyam NEWS

Leave a Comment