34.2 C
Hyderabad
April 23, 2024 12: 40 PM
Slider రంగారెడ్డి

తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం సైబరాబాద్ పోలీసుల రక్తదాన శిబిరం

#Cybarabad Police

సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదేశాల మేరకు తలసేమియా బాధితుల సహాయార్థం హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోని బుట్ట కన్వెన్షన్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరాన్ని మాదాపూర్ జోన్ డిసిపి వెంకటేశ్వర్లు పర్యవేక్షించి రక్తదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా డిసిపి  మీడియాతో మాట్లాడుతూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాల ప్రకారం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

రక్తం కోసం తలసేమియా బాధితులు ఎన్నో  ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు.

మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పలువురు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి వచ్చిన దాతలు అందరికీ ధన్యవాదములు తెలియజేశారు.

దాతలు ఎవరైనా ఉంటే ముందుకు  వచ్చి రక్త దానం చేయాలని చెప్పారు. రక్తదాన శిబిరం ముగిసే సమయానికి 62 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు ఇన్స్పెక్టర్ సమాచారం ఇవ్వటం జరిగింది.

ఈ రక్తదాన శిబిరంలో డిసిపి తోపాటు మాదాపూర్ ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్, ఎస్సైలు వీరప్రసాద్ ,భాస్కర్, సుఖేందర్రెడ్డి, హారిక, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Related posts

6129 కొనుగోలు కేంద్రాల ద్వారా 26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

Satyam NEWS

డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన జగన్ రెడ్డి

Bhavani

స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మసూద’ నవంబర్ 11న విడుదల

Satyam NEWS

Leave a Comment