ఒక వైపు కరోనా వైరస్ విస్తరిస్తున్న సమయంలో రక్తం నిల్వలు లేక అవస్థలు పడుతున్న రోగులను దృష్టిలో ఉంచుకొని నవయుగ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ లోని మదినా గూడ విజయ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ అల్లం పాండు రంగారావు సౌజన్యంతో చందానగర్ పీజేఆర్ స్టేడియంలో సోమవారం రక్తదాన శిబిరం ఉత్సాహంగా జరిగింది.
ప్రముఖ మధుమేహ నిపుణులు డాక్టర్ కిరణ్, కుకట్ పల్లి ఇన్ స్పెక్టర్ టంగుటూరి శ్రీనివాస్ లతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, స్థానిక యువకులు మొత్తం 102 మంది రక్తదానం చేశారు. ప్రభుత్వవిప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరెకపూడి గాంధీ శిబిరాన్ని ప్రారంభించగా స్థానిక కార్పొరేటర్లు బొబ్బ నవతరెడ్డి, విజగదీశ్వర్ గౌడ్, చందానగర్ ఇన్ స్పెక్టర్ రవిందర్, సైబరాబాద్ సీపీ కార్యాలయం ఆర్ఎస్ఐ ఫిలిప్ హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండావిజయ్ బ్లడ్ 2 లైవ్ సంస్థ వ్యవస్థాపకులు పవన్ కుమార్ లు శిబిరాన్ని సందర్శించారు.
రక్త దానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్ డౌన్ లో ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించి 100 మందికి పైగా ప్రాణదాతలను ఒక వేదిక పైకి తీసుకురావడం గొప్ప విషయమని అన్నారు.
అందుకు చొరవ చూపిన నవయుగ సభ్యులను, విజయ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకర & జననీ బ్లడ్ బ్యాంక్, విజయ హాస్పిటల్ ప్రతినిధులు, నవయుగ యూత్ సలహాదారు వినయ కుమార్ పుట్ట గౌడ్, అధ్యక్షులు వీరేశం గౌడ్ కాలివేముల, ప్రతినిధులు కృష్ణ, సుధాకర్ సాగర్, నరసింహములు, పాండు గౌడ్, నవీన్, గంగాధర్ గౌడ్, శ్రీకాంత్, మహేష్ గౌడ్, చిన్న, అశోక్, సత్యనారాయణ, శ్రీనివాస్, శ్యామ్ పాల్గొన్నారు.