పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (పోలీస్ ఫ్లాగ్ డే) లో భాగంగా జిల్లా ఎస్పి డా .జి.జానకి షర్మిల ఆదేశాలతో అవినాష్ కుమార్ ఆధ్వర్యం లో భైంసా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోపీనాథ్ ఈ రోజు భైంసా ప్రభుత్వ ఆసుపత్రి లో రక్త దాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు. ఆపద లో ఉన్న బాధితులకు రక్త దానం చేయటం అనేది చాలా గొప్ప విషయం. అందుకని ఏ.ఎస్పి నేతృత్వం లో ఇన్స్పెక్టర్ గోపినాథ్ ఈ రోజు రక్త దాన కార్యక్రమం నిర్వహించటం జరిగింది. అవినాష్ కుమార్ తో పాటు పోలీస్ అధికారులు స్వచ్ఛందంగా రక్తదానం చేయటం జరిగింది. మొత్తం 25 యూనిట్ల మేర రక్త దానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో అవినాష్ కుమార్ తో పాటు భైంసా పట్టణ ఇన్స్పెక్టర్ గోపీనాథ్, భైంసా గ్రామీణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నైలు, ఎస్ఐ లు ప్రదీప్, గౌస్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
previous post
next post