38.2 C
Hyderabad
April 25, 2024 14: 40 PM
Slider హైదరాబాద్

రక్తదాతల ఇంటి వద్దకే పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ

Sajjanar 121

థలసేమియా, క్యాన్సర్, మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు, బ్లడ్‌ కేన్సర్‌ రోగులు, హిమోఫీలియా తదితర జబ్బుల తో బాధపడుతున్న వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బ్లడ్ డొనేషన్ డ్రైవ్ లో ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ పాల్గొని రక్తదానం చేశారు.

విద్యానగర్ అడిక్ మెట్ వద్ద ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వద్ద సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సంయుక్తంగా దీన్ని ఏర్పాటు చేశారు. సీపీతో పాటు సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ సీఎస్ డబ్ల్యూ ఏడీసీపీ మాణిక్ రాజ్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీ (ఎస్సీఎస్సీ) జనరల్ సెక్రెటరీ కృష్ణ యేదుల, ఎస్సీఎస్సీ అసోసియేట్ డైరెక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి, సి‌టి‌సి డాక్టర్ సుకుమార్, ఆర్ఐ అరుణ్ కుమార్, ఆర్ఎస్ఐ ఫిలిప్ డోరాడో, ఏఆర్ సిబ్బంది, ఎస్సీఎస్సీ వలంటీర్లు రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ 19 దృష్ట్యా విధించన లాక్‌డౌన్‌ కారణంగా బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గిపోయాయని దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని రక్త నిల్వలు సేకరించడానికి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు.

ఇదే అంశమై ఇప్పటికే అన్ని ఐటీ కంపెనీలకు, ఉద్యోగుల వాట్సప్‌ గ్రూపులకు సమాచారం చేరవేశామని తెలిపారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, పోలీస్‌ గ్రూపుల్లో విషయాన్ని షేర్‌ చేశామన్నారు. ఎక్కువ మొత్తంలో రక్తదాతలు ముందుకు వచ్చి తలసేమియా బాధితులకు అండగా నిలబడాలని  సీపీ సజ్జనార్‌ పిలుపునిచ్చారు.

ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు, బ్లడ్‌ కేన్సర్‌ రోగులు, తలసేమియా, హిమోఫీలియా రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో వివిధ ఆస్పత్రుల్లో రక్తం అవసరమైన బాధితులు దాతల కోసం ఎదురుచూస్తున్నారు.

అలాగే రేర్‌ గ్రూప్‌లు అయిన ఏబీ-నెగెటివ్‌, ఓ-నెగెటివ్‌, బీ-నెగెటివ్‌, ఏ-నెగెటివ్‌ గ్రూప్‌ రక్తానికి తీవ్ర కొరత ఉంది. మరోవైపు ఇంట్లో నుంచి బయటకు వచ్చే వీలు లేకపోవడంతో దాతలు రక్తం ఇవ్వడం లేదు. వివిధ  స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్‌, ఐటీ కంపెనీల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించడం లేదు.

దీంతో రక్తం నిల్వలు పడిపోయాయి. రక్తం దొరక్కపోవడంతో తలసేమియా బాధితుల ముఖ్యంగా చిన్నారులు ఇబ్బంది పడుతున్నారన్నారు. దీంతో అత్యవసరంగా రక్త నిల్వల్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.  థలసేమియా, హిమోఫీలియా బాధితులకు తరచూ రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది.

థలసేమియాతో బాధపడేవారికి కనీసం నెలకు రెండు సార్లైన రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చిన దాతల ఇంటికే వాహనం పంపిస్తామని తెలిపారు. వారిని ఇంటి వద్ద నుంచి తీసుకెళ్లి తిరిగి అదే వాహనంలో జాగ్రత్తగా ఇంటివద్ద దిగబెట్టాలని సూచించారు.

దాతలు సైబరాబాద్‌ కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు 9490617440, 9490617431లో సంప్రదించాలని సూచించారు. అనంతరం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రెటరీ (ఎస్సీఎస్సీ) జనరల్ సెక్రెటరీ కృష్ణ యేదుల మాట్లాడుతూ అడిగిన వెంటనే ఇంత తక్కువ సమయంలో పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన సైబరాబాద్ పోలీసులు, ఎస్సీఎస్సీ వాలంటీర్లకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరియు ఐటీ సంస్థల నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సైబరాబాద్ లో అత్యవసర సేవలకు 13 అంబులెన్స్ లను అందుబాటులో ఉంచామన్నారు. అవసరం ఉన్నవారు ఈ సేవలను ఉపయోగించుకోవాలన్నారు.

Related posts

తప్పుడు కేసులతో ప్రభుత్వం నన్ను వేధిస్తోంది

Satyam NEWS

తప్పిన ముప్పు: కడెం ప్రాజెక్టు కు తగ్గిన వరద ఉధృతి

Satyam NEWS

పల్లె ప్రజల సృజనాత్మక శక్తిని గుర్తించమే మా లక్ష్యం

Satyam NEWS

Leave a Comment