36.2 C
Hyderabad
April 16, 2024 20: 39 PM
Slider శ్రీకాకుళం

రక్తదానం చేయడం అంటే ప్రాణం నిలబెట్టడమే

#SrikakulamCollector

రక్తదానం చేయడం ఒకరి ప్రాణం నిలబెట్టడంమని, కరోనా సమయంలో సిఐటియు‌ ముందుకొచ్చి రక్తదానం శిబిరం నిర్వహించి రక్తదానం చేయడం అభినందనీయమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. సిఐటియు సేవాకార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.

అక్టోబర్ విప్లవం పురస్కరించుకొని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సహకారంతో శ్రీకాకుళంలో సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ బ్లడ్ బ్యాంక్ లలో రక్తం అందుబాటులో ఉండే విధంగా సిఐటియు కృషి ఉందని కొనియాడారు.

రక్తదానం చేయడం ప్రాణదానంతో సమానమని అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కరోనా నుంచి రక్షణ పొందాలని కోరారు. సిఐటియు నాయుకులకు మోడల్స్ ఇచ్చి సత్కరించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు సి.హెచ్.నర్సింగరావు మాట్లాడుతూ రక్తదానం అన్ని దానాల కన్నా గొప్పదని అన్నారు.

ప్రాణాపాయ స్థితిలో రక్తం అందుబాటులో లేక అనేక మంది రోగులు చనిపోతున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు కార్మిక హక్కులు కోసం పోరాటాలే కాకుండా సేవా కార్యక్రమాలలో ముందుంటుందని అన్నారు.

అవసరమైన రక్తనిల్వలు లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సిఐటియు మే నెల నుండే రాష్ట్రవ్యాప్తంగా రక్తదానం నిర్వహిస్తున్నామని తెలిపారు. నవంబరు 1న రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని అన్నారు.

ప్రతి సంవత్సరం ఒకే రోజు 700 యూనిట్లు రక్తం ఇస్తూ సిఐటియు గవర్నర్ నుండి అవార్డు అందుకుంటుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ గారికి తను రచించిన పుస్తకాన్ని బహుకరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు మాట్లాడుతూ లాక్ డౌన్ కాలంలో క్వింటాలు కొలది బియ్యం, పప్పులు, కూరగాయలు, సబ్బులు, శానిటైజర్లు, మాస్కులు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిందని గుర్తు చేసారు.

ఈ రక్తదాన శిబిరంలో అరబిందో,  శ్యాంపిస్టన్స్ ప్లాంట్-2 శ్యాంపిస్టన్స్ ప్లాంట్ -3 , నాగార్జున అగ్రికెమ్, యునైటెడ్ బ్రేవరీస్, ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్స్, నీలంజ్యూట్, మెడికల్ రిప్స్ తదితర సిఐటియు అనుబంధ యూనియన్ కార్మికులు, ఉద్యోగులు రక్తదానం చేసారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఆర్.సురేష్ బాబు, పి.తేజేశ్వరరావు రెడ్ క్రాస్ ప్రతినిధి జాతీయ యోజన అవార్డు గ్రహీత పెంకి.చైతన్య కుమార్, డాక్టర్లు వి.సాయి,ప్రదీప్, ఎమ్.వి.ఎస్.ఎస్.శాస్తి,  సిఐటియు జిల్లా నాయుకులు  సి.హెచ్.అమ్మన్నాయుడు ఎన్.వి.రమణ, అల్లు.సత్యనారాయణ,

సి.హెచ్.రామ్మూర్తినాయుడు,  టి.తిరుపతిరావు, అల్లు.మహాలక్ష్మి కె.గురునాయడు, ఎస్.అప్పలరాజు, జె.కాంచన, జె.గంగరాజు, ఐ.నారాయణరావు, ఎస్.వి.రమణ, భోగేష్, శ్యామ్, జి.ఇరణ్,ఎస్.శివ, వరదరాజులు యుటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొంటి.గిరిధర్, జిల్లా కార్యదర్శి ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అక్రమ మైనింగ్ పై కలెక్టర్ కు ఫిర్యాదు

Bhavani

అడ్డుగా మేకులు

Sub Editor 2

టెన్త్ విద్యార్ధుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దు

Satyam NEWS

Leave a Comment