32.2 C
Hyderabad
April 20, 2024 20: 48 PM
Slider జాతీయం

కన్యాదానంతో సమానమైన దానం రక్తదానం : నూనె బాల్ రాజ్

#nunebalraj

ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హన్స్‌రాజ్ కళాశాలలో తెలుగు విద్యార్థి సంఘం, చెరైవేటి చెరైవేటి సేవా సంస్థతో పాటు ఎయిమ్స్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా బీజేపీ సెంట్రల్ కోఆర్డినేటర్ నూనె బాల్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్తదానం ప్రాముఖ్యతను నూనె బాల్ రాజ్ విద్యార్థులకు వివరించారు. భారతీయ సంస్కృతిలో అనేక రకాల దానాలు ఉన్నాయి, కానీ అతిపెద్ద దానాన్ని కన్యాదానం అంటారు, ఎందుకంటే తల్లి తండ్రుల రక్త, మాంసాలు  పంచుకుని పుట్టిన ఒక అమ్మాయిని కన్యాదానం చేస్తారు. అంతే ప్రాధాన్యత కలిగినది ఈ రక్త దానం. మనం రక్తాన్ని దానం చేయడం ద్వారా మరోకరి ప్రాణాలను కాపాడగలిగిన వారము అవుతాము. అన్ని దానాల్లో కన్నా రక్త దానం గొప్పది అని బాల్ రాజ్ తెలిపారు. రక్తదానం చేసిన ఎన్‌సిసి విద్యార్థులను బాల్‌రాజ్‌ అభినందించారు. అంతే కాకుండా రక్తదానం చేసిన విద్యార్థులకు పండ్లతో పాటు టీ-షర్టులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హంసరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామాతో పాటు, డీ.యూ.ఎస్.యూ. వైస్ ప్రెసిడెంట్ ప్రదీప్ తన్వర్, మోహిత్ చౌదరి పాల్గొన్నారు. తెలుగు విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు.

Related posts

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత

Satyam NEWS

లాక్ డౌన్ కు ఏడాది..

Satyam NEWS

కవిత పయనం ఎటువైపు.. పార్లమెంటా.. అసెంబ్లీనా-?

Satyam NEWS

Leave a Comment