39.2 C
Hyderabad
April 18, 2024 15: 38 PM
Slider ఖమ్మం

రక్తదానం సామాజిక బాధ్యత: ఖమ్మం పోలీస్ కమిషనర్

#khammampolice

రక్తదానం సామాజిక బాధ్యతని ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్  అన్నారు. అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని (పోలీసు ఫ్లాగ్ డే ) పురస్కరించుకొని ఈరోజు  ఖమ్మం పోలీస్ శాఖ  ఆధ్వర్యంలో పోలీస్ హెడ్ క్వార్టర్ అవరణలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ రక్తదాన శిబిరాన్ని పోలీస్ కమిషనర్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్   మాట్లాడుతూ శాంతి సమాజ నిర్మాణంలో అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలకు నివాళులర్పిస్తూ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ సమాజసేవలో పాలుపంచుకోవాలి అన్నారు. రక్తదాన శిబిరాల వల్ల ప్రమాద సమయంలో ఆపదలో ఉన్న రోగులకు రక్తం అందుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రతి 2సెకన్లకు ఎవరికో ఒకరికి రక్తం అవసరం ఉంటుందనే విషయాన్ని గ్రహించాలని అన్నారు. అత్యవసర సమయానికి రక్తం అందక ఎంతోమంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు.

ఈ సందర్భంగా  రక్తదాతలకు పండ్లను అందజేశారు. ఆటో డ్రైవర్లు, యువకులు. పోలీస్ సిబ్బంది ఉత్సహంగా పాల్గొని యాబై  మంది రక్తదాతలు రక్తదానం చేశారు.

ప్రభుత్వ  ఆసుపత్రి ఆద్వర్యంలో వైద్యబృందాలు బాధితులకు అందిస్తున్న సేవలు అభినందనీయామని అన్నారు.  ఈ సందర్భంగా రక్తదానం చేసిన వారిని పోలీస్ కమిషనర్ అభినందించారు.

ఈ సందర్భంగా పది రోజుల పాటు పోలీసుల పాత్ర, విధులు, పోలీసు విధుల్లో ప్రజల భాగస్వామ్యంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు  చేపడుతున్నామని అన్నారు. ఆన్‌లైన్ ఓపెన్ హౌస్ ద్వారా   విద్యార్థులకు  పోలీస్ విధులు పట్ల అవగాహన కల్పిస్తామని తెలిపారు.

26 సార్లు రక్తదానం చేసిన స్పెషల్ బ్రాంచ్ ఎఏస్సై సుధాకర్ రెడ్డి, 18 సార్లు రక్తదానం చేసిన సిఐ అంజలి, 16 రక్తదానం చేసిన SB హెడ్ కానిస్టేబుల్ సూరి ని పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో టౌన్ ఏసీపీ అంజనేయులు, రామోజీ రమేష్, AR ACP విజయబాబు, CI లు అంజలి,  చిట్టిబాబు , శ్రీధర్, రామకృష్ణ , తుమ్మ గోపి, శ్రీనివాసులు, RI లు రవి, శ్రీనివాస్ ,తిరుపతి, శ్రీశైలం, కార్పొరేటర్ వేంకటేశ్వర్లు,  డాక్టర్లు బి. బాలు, జీతేందర్, పాల్గొన్నారు.

Related posts

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ పట్టివేత

Satyam NEWS

విక్రమ సింహపురి యూనివర్సిటీ లో మహాత్మా గాంధీ వర్థంతి

Satyam NEWS

చీకటి జీవో పై ప్రజా విజయం…

Bhavani

Leave a Comment