ఆపదలో ఉన్నవారికి రక్తం దానం చేసిన నిఖిల్ రెస్టారెంట్ ఓనర్ నిఖిల్ అందరికి ఆదర్శంగా నిలిచారు. పక్షవాతం కారణంగా నిర్మల్ లోని రుషికేశ్ హాస్పటల్ కు టెంబి గ్రామానికి చెందిన 17 సంవత్సరాల శ్రీకాంత్ వచ్చాడు. అతనికి రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని డాక్టర్ సింధు చెప్పడంతో అతడిని ఎమర్జెన్సీ వార్డుకు తరలించి రక్తదాతలకు సమాచారం అందించారు. సమాజ సేవ కోసం అందుబాటులో ఉండే నిఖిల్ కు ఆసుపత్రి నుంచి సమాచారం రాగానే ఆయన జీవన్ దాన్ రక్త నిధికి వచ్చారు. అక్కడ తన అమూల్యమైన బి నెగెటివ్ రక్తం దానం చేశారు. దాంతో ఒక నిండు ప్రాణం నిలబడ్డది. ఇప్పటి వరకూ నిఖిల్ 18 సార్లు రక్తదానం చేశాడు. ఈ కార్యక్రమం ద్వారా రక్తదానం ప్రాధాన్యతపై అవగాహన కలిగించడంతో పాటు, అందరికీ ఆదర్శంగా నిలిచిన నిఖిల్ సేవను ప్రశంసిస్తూ సత్కరించారు. 18 నుండి 60 సంవత్సరాల వయస్సు గల ప్రతి ఒక్కరూ రక్తదానంలో భాగస్వాములై మూడు ప్రాణాలను కాపాడవచ్చని కార్యక్రమంలో పిలుపునిచ్చారు.
previous post