27.7 C
Hyderabad
March 29, 2024 02: 28 AM
Slider రంగారెడ్డి

రక్తదానంతో సమాజానికి ఉపయోగం మనకు ఆరోగ్యం

#blooddonation

రక్తం దానం చేయడం వల్ల దాతల ఆరోగ్యం కూడా మెరుగవుతుందని సి బి ఐ టి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి అన్నారు. దానితో బాటు మానసిక సంతృప్తి కలుగుతుందని ఆయన తెలిపారు. సిబిఐటి కళాశాల లో నేడు ఎన్‌ఎస్‌ఎస్‌  మరియు జూబ్లీ హిల్స్ లయన్స్ క్లబ్ సంయుక్తం గా  రెండు రోజుల రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి  ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ రక్తదానం నిస్వార్థ కార్యమన్నారు. నిర్ణీత వ్యవధిలో క్రమం తప్పకుండా రక్తదానం చేయాలని ఆయన ప్రజలను కోరారు.

రక్తదానానికి సంబంధించిన కొన్ని సాధారణ అపోహలను గురించి విద్యార్థులకు వివరించారు. రక్తదానం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం కూడా ఉంటుందని. ఇది దాతలు మరియు గ్రహీతలకు ప్రయోజనం చేకూర్చే జీవిత-రక్షక ప్రక్రియ అని  ఎన్‌ఎస్‌ఎస్‌ స్టాఫ్‌ కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ యం గణేశరావు అని అన్నారు. “ఇది ప్రాణాలను కాపాడుతుంది,  కాబట్టి అందరూ ముందుకు వచ్చి మానవత్వం కోసం రక్తదానం చేయాలని కోరుతున్నాను” అని  విద్యార్థి వ్యవహారాల, ప్రగతిశీల జాయింట్  డైరెక్టర్    ప్రొఫెసర్‌ కె జగన్నాధరావు అన్నారు.

మన దేశం లో జనాభాలో 7% మందికి మాత్రమే రక్తదానం ప్రాముఖ్యత తెలుసు, మరింత మంది రక్త దానం గురించి తెలుసుకోవాలి అని కళాశాల పిఆర్‌ఓ డాక్టర్‌ జిఎన్‌ఆర్‌ ప్రసాద్‌ అన్నారు. ఈ రోజు 300 మంది విద్యార్థులు మరియు సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వైద్య నిపుణుల బృందం  సిబిఐటి కళాశాల ప్రయత్నాలను మెచ్చుకుంది. ఈ కార్యక్రమంలో జూబ్లీ హిల్స్  లయన్స్ క్లబ్ సభ్యురాలు ఎన్  విజయలక్ష్మి, ఎ మాధవి, సిహెచ్ అరుణ, ఎం రత్నం పాల్గొన్నారు. దాతలకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

Related posts

విలేకరులకు స్వేచ్ఛ లేకుండా పోయింది

Satyam NEWS

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Satyam NEWS

మెగాస్టార్‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

Sub Editor

Leave a Comment