28.7 C
Hyderabad
April 20, 2024 09: 02 AM
Slider ముఖ్యంశాలు

ప్రజలకు సత్వర సేవలు అందించడంలో బ్లూ కోట్స్ విధులు కీలకం

#wanaparthypolice

వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయం నుండి  ఎస్పీ కె. అపూర్వరావు  జిల్లాలోని  డయల్100, బ్లూ కోట్స్, పెట్రో కార్ వర్టికల్  అధికారులకు, సిబ్బందికి దృశ్యసమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పౌర సమాజంలో  పోలీసు వ్యవస్థ యొక్క విధి  శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి పౌరుని యొక్క ధన, మాన, ప్రాణ, రక్షణకు అనువైన సురక్షిత వాతావరణం పెంపొందించడానికి అవసరమని, అతి ముఖ్యమైన బాధ్యతలైన, క్రియాశీల పోలీసింగ్, తక్షణ స్పందన, నేర నిరోధన, ప్రజా సంబంధాలు, కమ్యూనిటీ పోలీసింగ్ మొదలైన యావత్ పోలీసుశాఖ తరఫున అమలు పరచడంలో బ్లూ కోట్స్, పెట్రోల్ కార్  సిబ్బంది ముందు వరుసలో ఉంటూ ప్రజలకు పోలీసు వ్యవస్థ చేపట్టే కార్యక్రమాలు చేయాలన్నారు.

వారు అందించే సేవలపట్ల సానుకూలత విశ్వాసం నమ్మకం పెంచడంలో కీలక పత్ర నిర్వహించాల్సి ఉంటుందన్నారు. సమాజంలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ , సాంకేతిక పరిజ్ఞానం మార్పుల నేపథ్యంలో అంతే వేగంగా కొత్త తరహా నేరాలు ఆర్థిక, సామాజిక రంగాల్లో పెరుగుతున్నందు వల్ల  వ్యక్తులు వివిధ వర్గాల వారు అధిక స్థాయిలో పోలీసు వ్యవస్థ సేవలను భద్రతను నిరంతరం ఆశిస్తున్నారని చెప్పారు.  ప్రజలకు చేరువలో ఉండి అత్యవసర సమయంలో వినియోగించే డయల్ 100 కాల్స్ పట్ల వేగవంతమైన స్పందన తప్పక ఇవ్వాలని, తక్కువ సమయంలో సంఘటన స్థలానికి చేరుకొని సేవలు అందించాలని, డయల్ 100 ఫిర్యాదుల పట్ల రెస్పాన్స్ సమయం క్లోజింగ్ సమయం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు.

బ్లూకొట్స్, పెట్రో కార్ అధికారి డయల్100 కాల్స్ వచ్చినప్పుడు, అత్యవసర సమయంలో తక్షణమే స్పందించి, అతి తక్కువ సమయంలో బాధితులను మరియు సాక్షులను విచారించి తగిన చర్యలు తక్షణమే చేపట్టాలి మరియు విజిబుల్ పోలీసింగ్ అవసరమగు ప్రాంతాలను గుర్తించి నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ ద్వారా ఎక్కువ ప్రభావం ఉండే విధంగా విధులు నిర్వహిస్తూ ప్రజల్లో భద్రతా భావం పెంచవలెను, జన సంచారం లేని సమయాలలో విజిబుల్ పోలీసింగ్ విధులు నిర్వహిస్తూ సాధారణ ప్రజానీకం ముఖ్యంగా ఒంటరిగా వెళ్ళు మహిళలు పిల్లలు భద్రతా భావాన్ని పెంపొందించాలన్నారు.

ఏదైనా ప్రమాదం జరిగితే  ఆలస్యం లేకుండా అక్కడ సమస్య పరిష్కరించే విధంగా వెంటనే చేరుకోవడంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.ప్రజలకు అత్యంత చెరువుగా ఉంటూ విధులు నిర్వహించడంలో బ్లూ కోట్స్, పెట్రో కార్స్ పాత్ర చాలా ముఖ్యమైనదని ఎస్పీ   అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, సీసీఎస్,సీఐ, శ్రీనివాసచారి, జిల్లాలోని బ్లూ కోట్స్, పెట్రోల్ కార్స్ పోలీసు అధికారులు,ఐటీ కోరు, డీసీఆర్బీ, సిబ్బంది పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

నర్సింహన్ కు నామినేటెడ్ పోస్టా? ఏందది?

Satyam NEWS

సెక్రటేరియేట్ సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోం

Satyam NEWS

అంగన్ వాడి టీచర్ల సమస్యలు తీర్చాలి

Satyam NEWS

Leave a Comment