28.7 C
Hyderabad
April 20, 2024 05: 04 AM
Slider ప్రత్యేకం

నీలి విప్లవంతో వెలుగులు  

#puvvada

తెలంగాణలో చేపల పెంపకం పరిశ్రమగా అభివృద్ధి చెంది నీలి విప్లవం కొనసాగుతోందని తద్వారా మత్స్య కారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు, మత్స్య ఉత్పత్తిదారులకు సంభందిత రంగాల వారికి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నాయకత్వములో మత్స్యసంపదను పెంచేందుకు విశేషమైన కృషి జరుగుతుందన్నారు.  మత్స్య సంపద వల్ల రాష్ట్రంలోని 30లక్షల మంది మత్స్యకారులు లబ్ధిపొందుతున్నారని, ఇప్పటికే 23వేల చెరువులకు జియోట్యాగింగ్‌ అయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేసిన మిషన్ కాకతీయ ద్వారా చెరువులు అభివృద్ది చేసి మత్స్య సంపదను ప్రోత్సహించి లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పించారని అన్నారు. నీటి సంపదన పెంచి, వంద శాతం రాయితీతో చేప పిల్లలను ఉచితంగా ఇచ్చి, వాటిని పెంచడానికి పరికరాలను అందించి, మత్స్య సంపదనను ముఖ్యమైన ఆదాయ వనరుగా మార్చి, మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నిండుతున్న సందర్భంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

ఘనంగా మహేశ్ బాబు సోదరి పుట్టిన రోజు

Satyam NEWS

అయోధ్య రామాలయానికి అమరావతి మట్టి నీళ్లు

Satyam NEWS

జర్నలిస్టు మృతితో ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ రద్దు

Satyam NEWS

Leave a Comment