28.7 C
Hyderabad
April 20, 2024 08: 34 AM
Slider ఆంధ్రప్రదేశ్

నీటిలో కొట్టుకొస్తున్న మృతదేహాలు

dead bodies

గోదావరి నదిలో బోటు మునిగి మూడు రోజులయింది. ఎంత గాలించినా మృతదేహాలు దొరకడం లేదు. సహయక చర్యలకు పరిస్థితులు సహకరించలేని దుస్థితి. అందరు చేతులేత్తేశారు. పాపం ఏలా బందువుల్లో దు:ఖం…ఏడ్చి ఏడ్చి అలసి కన్నీరు కూడా రాలేని వైనం.. ఏవరు ఏమి చేయకున్న ..గల్లంతయిన వ్యక్తుల శవాలు ఒక్కోక్కటి ఒడ్డుకు కోట్టుకోస్తున్నాయి. నీటిలో ఉబ్బి పోయి చిద్రమయి చితికి పోయిన శవాలు ఇప్పటికే 8 లభ్యం కాగా మరికొన్ని లభ్యమయ్యే అవకాశముంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాదం ఘటనలో గల్లంతయిన మ తదేహాలు ఒక్కొక్కటిగా లభిస్తున్నాయి. మంగళవారం ఉదయం ఎనిమిది మ తదేహాలను గాలింపు సిబ్బంది కనుగొన్నారు. ప్రమాద స్థలం కచ్చులురు వద్ద నాలుగు, దేవీపట్నంలో మూడు, పోలవరం ఒకటి మ తదేహాలు లభించాయి. మిగిలిన వాటి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బలగాలు, నేవీ, విపత్తు నివారణ బ ందాల గోదావరిని జల్లెడ పడుతున్నాయి. గాలింపు కోసం చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ నుంచి ప్రత్యేక సిబ్బందిని రప్పించారు. ఇప్పటి వరకు లభించిన మ తదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిగిలిన మ తదేహాలన్నీ బోట్‌కు దిగువన లేదా బోట్‌ మొదటి అంతస్తులోని ఏసీ క్యాబిన్‌లో చిక్కుకుపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 16 మ తదేహాలు లభించగా, మరో 30 మ తదేహాలను గుర్తించాల్సి ఉంది.

Related posts

72వ ఏట అడుగుపెట్టిన భారత రిపబ్లిక్

Satyam NEWS

జంట‌న‌గ‌రాల‌లో టీఎస్ఆర్టీసీ హోం డెలీవ‌రీ సేవ‌లు

Sub Editor

రైతుల పట్ల శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేయాలి

Bhavani

Leave a Comment