Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యంశాలు

గల్లంతైన హైదరాబాద్ వాసుల వివరాలు ఇవే

boat tragedy

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచులూరు వద్ద గోదావరిలో ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటులో ప్రయాణిస్తున్నవారిలో ఎక్కువ మంది తెలంగాణకు చెందినవారే. హైదరాబాద్‌ నుంచి 22మంది, వరంగల్‌ నుంచి 14మంది పాపికొండలు విహార యాత్రకు వెళ్లారు.​ ఈ ప్రమాదం నుంచి వరంగల్‌ కాజీపేటకు చెందిన గొర్రె ప్రభాకర్‌ సహా పలువురు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదంలో గల్లంతైన హైదరాబాద్ వాసులుగా అధికారులు గుర్తించిన వారి పేర్లు: గాంధీ, విశాల్‌, లక్ష్మణ్‌, జానకిరామ్‌, రాజేష్‌, రఘురామ్‌, అబ్దుల్‌ సలీమ్‌, సాయికుమార్‌, రఘురామ్‌, విష్ణుకుమార్‌, మహేశ్వరరెడ్డి కుటుంబం, ధశరథన్‌-వరంగల్‌. కాగా ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారికి వైద్య సహాయం అందిస్తున్నారు. అలాగే ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని ట్రాక్టర్‌లో దేవీపట్నానికి తరలిస్తున్నారు. ఇక గల్లంతు అయినవారిలో 27మంది సురక్షితంగా బయటపడ్డారు. మరోవైపు ఈ దుర్ఘటనలో బోటు డ్రైవర్లు సంగాడి నూకరాజు, తామరాజు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై లాంచీ యజమాని వెంకట రమణ మాట్లాడుతూ కచులూరు వద్ద  పెద్ద సుడిగుండం ఉందని , దాన్ని దాటే సమయంలో డ్రైవర్లు సరిగా హ్యాండిల్‌ చేయలేకపోయారని అన్నారు.

Related posts

మహానాడు విజయవంతం చేయాలని పిలుపు

Satyam NEWS

క్రైమ్ సర్వే:రోజుకు 80 హత్యలు 91 రేప్‌లు జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో

Satyam NEWS

పాపాగ్ని నది పొంగడం తో రాకపోకలు బంద్

Satyam NEWS

Leave a Comment