27.7 C
Hyderabad
March 29, 2024 03: 34 AM
Slider శ్రీకాకుళం

జన హృదయ విశ్వ విజేత జనం మెచ్చిన మహా నేత

boddepally rajagopalarao

శ్రీకాకుళం జిల్లా ప్రజలు, రైతుల క్షేమం కోసం నిరంతరం పాటుపడిన మహానీయుడు బొడ్డేపల్లి రాజగోపాలరావు జయంతి సందర్భంగా పలువురు ఆయనకు నివాళి అర్పించారు. కళింగ జాతి ముద్దు బిడ్డ గా పేరు పొందిన బొడ్డేపల్లి రాజగోపాలరావు వ్యక్తి గా తన సామాజిక వర్గాన్ని విముక్తి సంచార జాతి నుండి తప్పించేందుకు జరిగిన కుట్రను ఎదుర్కున్నారని ఈ సందర్భంగా వక్తలు గుర్తు చేసుకున్నారు.

కళింగ కులం ను BC-A లో పొందుపరచి, సామాజిక, ఆర్థిక, విద్యా పరం గా అభివృద్ధి చెందేందుకు తోడ్పాటు అందించిన మహోన్నత వ్యక్తి ఆయన అని అన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గా, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటి వ్ డైరెక్టర్ గా, మూడు దశాబ్దాలు పాటు శ్రీకాకుళం మునిసిపల్  ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ఆయన పనిచేసారు.

ఆమదాలవలస మండలం, అక్కులపేట గ్రామం లో1923 మార్చి 12వ తేదిన ఆయన జన్మించారు. 29వ ఏట స్వతంత్ర అభ్యర్థి గా శ్రీకాకుళం పార్లమెంట్ కి పోటీ చేసి గెలుపొంది, జవహర్ లాల్ నెహ్రు పిలుపు మేరకు భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి 1952నుండి 1984 వరకు 6 సార్లు శ్రీకాకుళం నుండి లోకసభ కు ప్రాతినిధ్యం వహించారు.

శ్రీకాకుళం జిల్లా వాణి దేశవ్యాప్తంగా వినిపించిన ప్రధమ వ్యక్తి. జాతి, మతం, కులం బేధం లేకుండా ఆజాత శత్రువు గా, ప్రజలమనిషి గా నిరంతరం ప్రజలు కోసం ఆయన పని చేశారు. ఆమదాలవలస చెక్కర కర్మాగారం, రైల్వేస్టేషన్, చింతాడ (రాగొలు ), బారువా లో వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, పొందూరు నూనె మిల్లులు, పరిశ్రమలు ఏర్పాటుకి పారిశ్రామిక వాడ ఏర్పాటు కి ఆయన కృషి చేశారు.

పి. వి. నర్సింహా రావు, జలగం వెంగల రావు ల సహకారం తో వంశధార కాలువలు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు.

Related posts

రజనీకాంత్ పై వైసీపీ నీచపు వ్యాఖ్యలు

Satyam NEWS

ఆగని పాకిస్థాన్ దుశ్చర్యలు: ఈ సారి డ్రోన్ ప్రయోగం

Satyam NEWS

కోడూరు మస్తాన్ రెడ్డికి ఎంపీ ఆదాల శ్రద్ధాంజలి

Bhavani

Leave a Comment