30.3 C
Hyderabad
March 15, 2025 09: 15 AM
Slider జాతీయం

ఢిల్లీలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు

#delhischool

దేశ రాజధాని ఢిల్లీలో సరస్వతి విహార్‌లో గల ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అదే విధంగా మంగళవారం ఉదయం ఢిల్లీలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌, నార్త్‌ వెస్ట్ ఢిల్లీలోని సరస్వతి విహార్‌లో గల ఓ పాఠశాలకు బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. ఢిల్లీలోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం నిత్యకృత్యంగా మారింది. గత వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు ఢిల్లీ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఇ-మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆయా పాఠశాలల వద్దకు చేరుకొని విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించారు. అనంతరం బాంబ్ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్ సాయంతో పాఠశాలల ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Related posts

ఏపిలో పెట్టుబడులకు ‘సాఫ్ట్‌ బ్యాంక్‌’ ఆసక్తి

Satyam NEWS

బైపాస్ రోడ్ లో లారీల ప్రయాణం నరకయాతన

Satyam NEWS

మున్నేరు వరద బాధితులకు గృహ వినియోగ వస్తువులు పంపిణి

mamatha

Leave a Comment