28.7 C
Hyderabad
April 20, 2024 07: 22 AM
Slider మహబూబ్ నగర్

అటవీ భూముల పట్టా పొందిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి

#PDAct

కొల్లాపూర్ అటవీ శాఖకు సంబంధించిన  భూములను  పట్టాలు  పొందిన వారిపై పి.డి యాక్ట్ కేసు నమోదు చేయాలని రామాపురం గ్రామ ప్రజలు కొల్లాపూర్  రేంజ్ ఆఫీసర్ రవీందర్ నాయక్ కు ఫిర్యాదు చేశారు.

కొల్లాపూర్ మండల పరిధిలోని రామాపురం శివారులో సర్వే నెంబర్ 223 అటవీ శాఖకు సంబంధించిన భూములను కొందరు పట్టాలు  చేసుకున్నారని గ్రామస్తులు ఆరోపించారు.

2012లో ఆన్లైన్లో నమోదు చేస్తే 2016 లో ఫిర్యాదు ఎలా చేస్తామని రామాపురం గ్రామ వాసి కొమ్ము రాజు ప్రశ్నించారు. అంతేకాకుండా 223 సర్వే నెంబర్ గల రెవెన్యూకు సంబంధించిన  భూమిని  మాత్రమే పట్టాలు ఇవ్వాలి కానీ ఎమ్మార్వో, విర్వోలు ఇద్దరు కలిసి తప్పుడు పేర్లను ఆన్లైన్లో నమోదు చేశారని ఫిర్యాదులో తెలిపారు.

దీనిపై విచారణ చేపట్టి ఫారెస్ట్ పరిధిలో పట్టాలు పొందిన వారిపై పిడి యాక్ట్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు ద్వారా తెలిపారు. ఫిర్యాదును పరిశీలిస్తామని ఫారెస్ట్ రేంజర్ రవీందర్ నాయక్ అన్నారు.

Related posts

సీఎం కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలి

Satyam NEWS

హుజుర్ నగర్ మండలాన్ని కరోనా రహితంగా మారుద్దాం

Satyam NEWS

ఎస్‌జెఆర్‌వో కృష్ణా జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొంకిమ‌ళ్ళ శంక‌ర్

Satyam NEWS

Leave a Comment