Slider ప్రకాశం

వాసవి క్లబ్బు ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి

#vasavi

చేయిచేయి కలుపుదాం ఆపదలో ఉన్నవారిని ఆదుకుందాం అంటూ కందుకూరు పట్టణంలోని  వాసవిక్లబ్ లెజెండ్స్ వారి ఆధ్వర్యంలో  సింగరాయకొండ రోడ్డు మాల్యాద్రికాలనీలోని  మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు విద్యాసామాగ్రి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయవరపు పద్మ మాట్లాడుతూ కందుకూరు వాసవిక్లబ్స్  ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు వారి విద్యాభివృద్ధికి అవసరమైన వస్తువులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ లెజెండ్స్ ప్రెసిడెంట్ సేవా హ్రుదయ డాక్టర్ రవ్వా శ్రీనివాసులు(ఎల్ ఐ సి ఏజెంట్), సెక్రటరీ ఇన్నమూరి శ్రీనివాసులు, ట్రెజరర్ చీధెళ్ళ క్రృష్ణ, శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ రవ్వా అరుణ,SMC చైర్మన్ చంగాదేవి, వార్డు మెంబరు మంజులత, పంచాయితి సెక్రటరీ, సచివాలయం ఇంజనీర్ జనార్ధన రావు   తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేంద్రం సొమ్మును హైజాక్ చేస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

పాముతో సెల్ఫీ.. కందుకూరులో యువకుడు మృతి

mamatha

కాంగ్రెస్ లోకి జూపల్లి: బోగస్ ప్రచారంపై మాజీ మంత్రి సీరియస్

Satyam NEWS

Leave a Comment