22.2 C
Hyderabad
December 10, 2024 11: 33 AM
Slider సంపాదకీయం

నిన్న బిర్యానీ.. నేడు టీ…. పోలీసులకి బోరుగడ్డ ఆదేశాలు

#borugaddaanil

వైసీపీ జమానాలో సాక్షాత్తు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును బహిరంగంగా వాడుకుంటూ గూండాయిజం చేసిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు ఖాకీలు చేస్తున్న రాచ మర్యాదలు అన్నీ ఇన్నీ కావు. జలు తరిలిస్తూ స్టార్ హోటల్ లాంటి దాబాలో బిర్యానీ పెట్టించి కొందరు పోలీసులు సస్పెన్సన్ కు గురి కాగా… పోలీస్ స్టేషన్ లో.. అది కూడా రాత్రి వేళ.,. తన బంధువైన ఓ బాలుడిని పిలిపించి.,.. బోరుగడ్డ పక్కనే కుర్చీ వేసి…గంట పాటు వారు ఏకాంతంగా చర్చించుకునే ఏర్పాట్లు చేసిన మరో ఘటనలో మరికొందరు పోలీసులపై వేటు పడింది.

ఈ రెండు ఘటనలు మరిచిపోకముందే… బోరుగడ్డకు ఠాణాలోన జరిగిన మరో రాచ మర్యాదకు చెందిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో దర్జాగా కుర్చీలో కూర్చున్న బోరుగడ్డ… భయ్యా ఓ టి అనగానే క్షణాల్లో ఓ కానిస్టేబుల్ అతడికి తేనీటి కప్పును అందించారు. సదరు టీని ఠీవీగా సేవిస్తూ పోలీస్ స్టేషన్ లోనే దర్పం ఒలకబోసిన బోరుగడ్డ దృశ్యాలు సదరు వీడియోలో కనిపిస్తున్నాయి.

వైసీపీ అధికారంలో ఉండగా… తాను సీఎం జగన్ సోదరుడినని చెప్పుకున్న బోరుగడ్డ అనిల్… గుంటూరులో రౌడీ రాజ్యాన్ని నడిపారు. తనకు ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించిన బోరుగడ్డ…  చాలా మందిని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు. ఈ డబ్బులతో ఖరీదైన కార్లు కొనుగోలు చేసి దర్జాగా కాలం వెళ్లదీశాడు. అంతేనా… వైసీపీ సర్కారు పెద్దలు చెప్పినట్టుగా విపక్షాలకు చెందిన కీలక నేతలపై నోటికి వచ్చినట్లుగా దుర్భాషలు ఆడిన అనిల్… రాష్ట్రంలో పెను కలకలమే రేపాడని చెప్పాలి.

ఈ క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో పాటుగా ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్ లను గంటలో చంపేస్తానంటూ అనిల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక వైసీపీపై విమర్శలు చేసిన రాజకీయ నేతలకు నేరుగా ఫోన్లు చేసిన అనిల్…వారిని కూడా చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు అయితే వైసీపీ అండ ఉండటం, స్వయంగా జగనే తనకు రక్షణగా నిలిచారని అనిల్ చెప్పుకోవడంతో అనిల్ పైై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు.

అయితే మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం ఎదురు కావడం, టీడీపీ నేతృత్వంలోని కూటమి రికార్డు మెజారిటీతో విజయం సాధించి చంద్రబాబు ఆధ్వర్యంలో కొత్త సర్కారు కొలువుదీరడంతో అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. అప్పటిదాకా వైసీపీ అండ ఉన్న కారణంగా అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనుకాడిన పలువురు వ్యక్తులు కూటమి సర్కారు కొలువుదీరినంతనే అతడిపై కంప్లెయింట్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.

ఈ క్రమంలో తనను డబ్బుల కోసం బెదిరించాడంటూ గుంటూరుకుచెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు అనిల్ పై కేసు నోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకు అతడిని రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. ఆపై అనిల్ పై రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫిర్యాదులు రావడం, వాటి ఆధారంగా కేసులు నమోదు కావడం, వాటి విచారణ కోసమంటూ అతడిని ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించడం జరుగుతూ వస్తోంది.

ఈ క్రమంలోనే అనిల్ పోలీసులకు ఆర్డర్లు వేస్తున్న తీరు బట్టబయలు అయ్యింది. వైైసీపీ జమానాలో ఓ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించిన అనిల్… పోలీసు శాఖలో కొందరు అదికారుల వద్ద పరపతి పెంచుకున్నట్లుగా సమాచారం. ఇప్పుడు ప్రభుత్వం మారి అరెస్ట్ అయినప్పటికీ… తన పాత పరిచయాలను వినియోగిస్తున్న అనిల్… పోలీసులతో రాచ మర్యాదలు చేయించుకుంటున్నట్లుగా సమాచారం.

అయితే ఇలా ఓ రౌడీ షిటర్ గా ఉన్న అనిల్ కు రాచ మర్యాదలు చేస్తున్న ఘటనల్లో కేవలం కింది స్థాయి పోలీసులపైనే వేటు పడుతోంది. ఆ కింది స్థాయి పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన పోలీసు అధికారులపై ఎలాంటి చర్యలు లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా వైరల్ అయిన వీడియోలో ఓ నేరగాడిని స్టేషన్ లో నేలపైైనే కూర్చోబెట్టిన పోలీసులు… అతడి ఎదుటే అనిల్ కు కుర్చీ వేసి మరీ కూర్చోబెట్టిన వనం స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ హయాంలోనూ ఈ రౌడీ షీటర్ కు రాచ మర్యాదలకు ఎప్పుడు చెక్ పడుతుందోనన్న రీతిలో ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.

Related posts

స్పష్టమైన ఓటర్ జాబితా రూపొందించాలి

Bhavani

కరిగిపోవా..

Satyam NEWS

ఏప్రిల్‌ నెలలో తిరుమ‌ల‌లో నిర్వహించే విశేష ప‌ర్వ‌దినాలు ఇవే

Satyam NEWS

Leave a Comment