విద్యాశాఖ మంత్రి గా పని చేసిన బొత్స సత్యనారాయణ హాయంలోనే మొత్తం విద్యా శాఖ భ్రష్ట పట్టిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నేత చీమల సంతోష్ కుమార్ ఈ నెల 12 న రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్పీపీ ఫీజ్ రీయంబర్స్ మెంట్ బకాయిలకు నిరసనగా యువత పోరు అనే నిరసన కార్యక్రమం నిర్వహించడానికి మనసెలా వచ్చిందంటూ సూటిగా ప్రశ్నించారు. పార్టీ కార్యాలయం అయిన విజయనగరం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నేతలు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం లోనే దాదాపు నాలుగు వేల కోట్ల ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు లేవా అని చీమల సంతోష్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎనిమిది నెలలు అవుతున్నా ఫీజ్ రియంబర్స్ మెంట్ ఇవ్వల్లేదని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2022 లో ఆ ఫీజ్ రీయంబర్స్ మెంట్ అందకే శ్రీకాకుళంలో ఓ యువతి మృతి చెందలేదా అని ప్రశ్నించారు. రెండు విడతలుగా ఫీజ్ రీయింబర్స్ మెంట్ ఇస్తామని చెప్పి..ఆ నిధులను వేరే జగనన్న దీవెన పథకంకు మార్చలేదా అని నిలదీసారు. కేవలం పార్టీని ఉనికిని కాపాడుకోవడం కోసమే వైఎస్ఆర్పీపీ ఫీజు రీయింటబర్స్ మెంట్ పై యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని టీఎన్ఎస్ఎఫ ఆక్షేపించింది.
previous post
next post