27.7 C
Hyderabad
April 25, 2024 10: 00 AM
Slider హైదరాబాద్

ధర్మపురి కాలనీ మురుగునీటి సమస్య తీర్చిన ఎమ్మెల్యే

#dharmapuri

హైదరాబాద్ లోని ఎల్ బి నగర్ నియోజకవర్గంలోని ధర్మపురి కాలనీలో బాక్స్ టైప్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కాలనీవాసుల ఇబ్బంది గమనించి ఈ ప్రత్యేక వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. సరూర్ నగర్, లింగోజీగూడా (ధర్మపురి కాలనీ)లో గత కొన్ని యేళ్ళుగా వర్షం వచ్చినప్పుడల్లా బైరామల్ గూడా నుంచి గ్లోబల్ హాస్పటల్ మీదుగా వచ్చే వ్యర్థపదార్థాలు, ప్లాస్టిక్ సంచులతో కూడిన డ్రైనేజీ మురికినీళ్ళు సునామీలాగా వచ్చేవి.

ధర్మపురికాలనీ మెయిన్ రోడ్డుపై నుంచి ప్రవహిస్తూ ఇళ్లలోకి మురికినీరు చేరుకుని ఎంతో దుర్గంధంతో నిండిపోతుండేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు బాక్స్ టైపు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన కాగా గత కొన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న బాక్స్ టైప్ అండర్ గ్రౌండ్ మ్యాన్ హోల్ పని యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. దీంతో ధర్మపురి కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో యల్. బి.నగర్ యమ్.ఎల్.ఏ. దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, దర్పల్లి రాజశేఖర రెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ జి.యస్.రాజుకి జి.హెచ్ ఎమ్.సి అధికారులకు కాలనీవాసులు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.

Related posts

టీడీపీ ఎంపి గల్లా జయదేవ్ కు షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS

జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల దాతృత్వం

Satyam NEWS

ఉద్యోగులకు న్యాయపరంగా రావాల్సిన డిఏలు కనుకలా?

Satyam NEWS

Leave a Comment