కేరింత, మనమంతా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న విశ్వంత్ హీరోగా నటిస్తున్న సినిమాకు BFH (బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్) అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. నిర్మాత యశ్ రంగినేని, హీరో విజయ్ దేవరకొండ నాన్న గోవర్ధన్ దేవరకొండ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చారు. ‘BFH’లో మాళవిక సతీషన్, పూజా రామచంద్రన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శివాజీ రాజా, రాజా రవీంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ కంభంపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆగస్ట్ 26 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ‘BFH’ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తుండగా.. స్వస్తిక సినిమా బ్యానర్‌లో వేణు మాధవ్ పెద్ది నిర్మిస్తున్నారు.
previous post